ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ టైటిల్ గెలిచాక వరుస ఆఫర్లు అందుకుంటున్న అభిజిత్..??

Share

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అభిజిత్.. సినిమా విజయం సాధించినా కానీ తర్వాత పెద్దగా అవకాశాలు రాబట్టలేక పోయాడు. ఆ తర్వాత పెళ్లిగోల వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో అవకాశం రావడంతో కచ్చితంగా అభిజిత్ కెరియర్ కి ప్లస్ అవుతుందని అందరూ భావించారు.

Bigg Boss Telugu Season 4 grand finale: Abijeet Duddala lifts trophy | Entertainment News,The Indian Expressఅనుకున్నట్టే అభిజిత్ టైటిల్ విన్నర్ గా గెలవడంతో బయట భారీ స్థాయిలో అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. హౌస్ లో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ తరహాలో గేమ్ ఆడటం మాత్రమే కాక ఎవరికీ ఎంత విలువ ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో పెడుతూ హౌస్ లో అనేకసార్లు అందరి ద్వారా వ్యతిరేకత ఎదుర్కొన్నా గాని.. తన యాటిట్యూడ్ విడిచిపెట్టకుండా టైటిల్ గెలవడంతో చాలామంది హృదయాలను కూడా అభిజిత్ గెలవడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో అభి క్రేజ్ వున్న కొద్ది పెరగటంతో ఇండస్ట్రీ నుండి ఇద్దరు పెద్ద డైరెక్టర్లు సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలు మాత్రమే కాక 12 వెబ్‌ సిరీ‌స్‌ల్లో నటించే అవకాశం అభి కి లభించినట్లు సరికొత్త టాక్ వస్తోంది. ప్రస్తుతం అభిజిత్ బయట వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. చాలా వరకు తన టైం కుటుంబంతో గడపాలని ఉందని, హౌస్ లో ఉన్నంతకాలం వాళ్ళని మిస్ అయినట్లు చెప్పుకొచ్చాడు. అంత మాత్రమే కాక ఈ స్థాయిలో బయట అభిమానం సంపాదిస్తాను అని కలలో కూడా ఊహించలేదు అన్నట్టు ఇంటర్వ్యూలలో అభి తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు.


Share

Related posts

బ్రేకింగ్: అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవానికి ఎంపికైన నాని ‘జెర్సీ’

Vihari

వరుస ప్రమాదాలు.. మృతులు..! విశాఖ వాస్తుపై చర్చ

Muraliak

కరోనా నుండి కోలుకున్న శాసనమండలి చైర్మన్ షరీష్

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar