బిగ్ బాస్ టైటిల్ ఫోర్ విన్నర్ అభిజిత్ ఎలక్ట్రానిక్ మీడియా లో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాల గురించి పంచుకుంటున్నారు. అయితే బయట వస్తున్న రెస్పాన్స్ ఈ స్థాయిలో ఉంటుందని అసలు కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు నా గేమ్ నచ్చి, నాకు చివరిలో సపోర్ట్ చేయటం మెమరబుల్ మూమెంట్ అంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ వస్తున్నారు.
ఇదిలావుంటే ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫ్రెండ్స్ అయినా సోహెల్ మెహబూబ్ యూట్యూబ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని అభి కి ప్రాంక్ కాల్ చేయడం జరిగింది. సోహెల్ ఎవరో తెలియని వ్యక్తి గా అభి తో మాట్లాడుతూ సినిమా అవకాశం అంటూ.. చాలాసేపు అలరించాడు. అయితే చివరాకరికి అభి గుర్తుపట్టడం తో పాటు సోహెల్ కి అదేవిధంగా మెహబూబ్ కి దిమ్మ తిరిగే డైలాగ్ వేశాడు.
మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేము మీరు హౌస్ లో చివరిలో చేసిన పని కి ప్రతి చోట ప్రశ్నలు ఎదురవుతున్నాయి అన్నట్టు కామెడీ కామెంట్లు చేశాడు. ఆ తర్వాత అభి సీరియస్ గా మాట్లాడుతూ.. సోహెల్ హౌస్ లో మర్చిపోలేని వ్యక్తి అని చివరిలో మంచి బాండింగ్ ఏర్పడింది అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఈ కార్యక్రమంలో వీడియో స్కామ్ గురించి అభిజిత్ వేసిన డైలాగులు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.