బిగ్ బాస్ 4 సీజన్ దగ్గర పడే కొద్ది కంటెస్టెంట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటోంది. ఆ ఇంట్లో హౌస్ మేట్స్ మధ్య టాస్క్ ల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వా నేనా అంటూ తమ పర్ఫామెన్స్ ను చూపెడుతున్నారు ఇంటి సభ్యులు. కాగా బిగ్ బాస్ ఇంట్లో అందరికీ గట్టి పోటీనిస్తున్నాడు అభిజీత్. ఇంతకు ముందు వారాల్లో కంటే బెటర్ పర్ఫామెన్స్ ను చూపెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు లవర్ బాయ్ అభిజీత్. కాగా ఈ బిగ్ బాస్ ఇంట్లో అభిజీత్ కు అమ్మాయిల ఫాలోయింగ్ భాగానే ఉందని అర్థమవుతోంది. కాగా అభిజీత్ గురించి తన తల్లి చెప్పన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.. మరి అవేంటో మీరు తెలుసుకోండి..
బిగ్ బాస్ ఇంట్లో అభిజీత్ చెప్పనట్టు జంతు ప్రేమికుడు. వాటిని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. ఇంట్లో కూడా అభిజీత్ కు పెంపుడు కుక్క కూడా ఉంది. అలాగే ఏ జంతుకువు కష్టం వచ్చినా చూస్తూ ఉండలేడు. అలాగే ఒక సారి రోడ్డుపై వెలుతున్నప్పుడు ఓ ఒంటెను దాని యాజమాని ఇబ్బంది పెడితే తట్టుకోలేక ఒంటె యాజమానిని కొట్టాడట. అది పేపర్లో చూసి నేను ఆశ్చర్యపోయానని ఆవిడ తెలిపారు. అలాగే అభిజీత్ కు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని తన కొడుకు స్పష్టం చేశాడని ఆమె తెలిపారు.
ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే అలాంటివేవీ లేవని నేను అరెంజ్ మ్యారేజే చేసుకుంటానని తెలిపాడని ఆమె తెలిపారు. కాగా ప్రేమ పెళ్లి ఎప్పటికీ చేసుకోనని అభిజీత్ తెలిపాడని అతని తల్లి వెళ్లడించారు. కాగా బిగ్ బాస్ ఇంట్లోని అమ్మాయిల్లో అభిజీత్ కు ఎవరు సెట్ అవుతారనే ప్రశ్నకు ఆమె అరియానా, హారికా, మోనాల్ గజ్జర్ ముగ్గురిలో ఉన్న క్వాలిటీస్ ఉన్న ఏ అమ్మాయి అయినా సరే బాగుంటుందని ఆమె తెలిపారు.
కాగా ఆ ముగ్గురిలో అభిజీత్ కు ఎవరు పెళ్లికి సెట్ అవుతారనే దానికి మాత్రం సమాధానం ఇచ్చారు. అభిజీత్ కు సరైన జోడి అంటే మాత్రం ఖచ్చితంగా హారిక అనే చెప్పొచ్చు. ఎందుకంటే వారి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయి. ఇంకా వారి మనస్తత్వాలు కూడా కలుస్తాయి. మరీ ముఖ్యంగా ఒకరినొకరు అర్థంచేసుకుంటారు. వారి మధ్యన మంచి స్నేహం కూడా ఉంది కాబట్టి అభిజీత్ కు సరైన జోడి నిహారిక సరిపోతుందని అభిజీత్ తల్లి తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!