ABN RK: గేమ్ లో ఇరుక్కున్న జగన్..? 2024 టార్గెట్ గా భారీ ప్లాన్..?

Gorantla Bucchayya: Resignation Drama by ABN
Share

ABN RK: ఏపిలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయంగా బలమైన నాయకుడు. ఈ విషయంలో నో డౌట్. ప్రస్తుతానికి రాజకీయంగా చూసుకున్నా, ప్రజాబలంగా చూసుకున్నా తిరుగులేదు. కానీ ఎన్నో బలహీనతలు, లోపాలు ఉన్నా బలమైన నాయకుడు. ప్రతి నాయకుడికి బలహీనతలు ఉన్నట్లే. బలమైన జగన్మోహనరెడ్డికి కూడా అనేక బలహీనతలు, అనేక లోపాలు ఉన్నాయి. పరిపాలనా పరమైన లోపాలు, రాజకీయ పరమైన లోపాలు ఉన్నాయి. ప్రత్యర్థులు ఈ బలహీనతలు, లోపాలను వాడుకుంటే జగన్మోహనరెడ్డిని ఆడుకోవచ్చు. ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ చేస్తున్నది అదే. ఎందుకంటే ఒక సీఎంను పట్టుకుని రాత్రివేళల్లో ఆత్మలతో మాట్లాడుతారు, తండ్రి వైఎస్ ఆత్మతో జగన్ మాట్లాడతారు అంటూ ఏబీఎన్ ఆర్కే వీకెండ్ కామెంట్ లో నెల రోజుల క్రితం రాశారు. మళ్లీ జీసెస్ తో మాట్లాడతారు అని కూడా రాశారు. ఒక సీఎంను పట్టుకుని అభూతకల్పనతో రాయడం పెద్ద సాహసం. కానీ ఏబీఎన్ ఆర్కే రాశారు.

కానీ దానిపై సీఎం ఆఫీసు నుండి గానీ ఆ పార్టీ నేతల నుండి పెద్దగా కౌంటర్ లు లేవు. మహా అయితే ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని లాంటి వారు తిడతారు. అంతకు మించి ఏమీ చేయలేరు. న్యాయ పరంగా కోర్టు కేసుల్లో ఇరికించలేరు. నెల రోజుల క్రితం ఏబీఎన్ ఆర్కే ఈ విధంగా రాస్తే వైసీపీ న్యాయపరంగా ఫైట్ చేయడానికి సిద్ధం కాలేదు. లీగల్ గా ప్రొసీడ్ అయి ఉంటే ఏబీఎన్ ఆర్కే దాన్ని కోర్టులో నిరూపించుకోవాల్సి వచ్చేది. కానీ కోర్టులో ఈ విషయంలో ఎప్పుడో తేలుతుంది. అయితే కోర్టులో వాయిదాకు వచ్చిన ప్రతి సారి ఒక వార్తే అదీ మీడియాలో హైలెట్ అవుతుంది. కానీ ఇది మంచిది కాదు. ఒక వ్యక్తిని మతి స్థిమితంలేదు, ఆత్మలతో మాట్లాడతారు అంటూ సీఎం స్థాయి వ్యక్తిని బదనామ్ చేయడం అంటే అదొక స్ట్రాటజీ మాత్రమే. ఇప్పుడు మళ్లీ ఏబీఎన్ ఆర్కే జగన్ వంటరి అని రాశాడు.

వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ సభ్యులు కూడా జగన్ ను పట్టించుకోవడం లేదు అని రాశారు. ఎందుకంటే వైఎస్ సునీతారెడ్డి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ తన అన్న జగన్మోహనరెడ్డిని అడగకుండా కడప ఎస్పీని కలిశారు అంటే జగన్మోహనరెడ్డిని పట్టించుకోవడం లేదనే కదా అర్ధం అందుకే వైఎస్ కుటుంబంలో జగన్ ఒంటరి అని రాశారు. ఇదీ కూడా ఒక స్ట్రాటజీ. మరోక పాయింట్ ఏమిటంటే .. వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత షర్మిల జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. అలానే షర్మిల ప్రతి ప్రొగ్రామ్ ను అది చిన్నదైనా, పెద్దదైనా, మీడియా సమావేశం అయినా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నది, ఎక్కువగా దానిపై పదేపదే వార్తలు ఇస్తున్నదీ ఏబీఎన్ ఛానల్ మాత్రమే.


ఇది కూడా ఒక స్ట్రాటజీ. అంటే జగన్ ఫ్యామిలీలోనే జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్లు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతరెడ్డి, విజయమ్మ ఇలా వీళ్లందరినీ హైలెట్ చేస్తూ వాళ్ల ద్వారా జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా ఒకటో రెండో మాటలు రాబట్టుకుని వాటి ద్వారా జగన్మోహనరెడ్డి బలహీనతలను, లోపాలను ప్రజల ముందు ఉంచాలనేది ఒక స్ట్రాటజీ. సో.. అందుకే ఇలా రాస్తూ వస్తున్నారు. జగన్మోహనరెడ్డి మైండ్ సెట్ మీద, అలాగే ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ మీద కూడా ఏబిఎన్ ఆర్కే స్ట్రాటజీ ప్రకారం రాస్తున్నారు. ఇవేమీ కూడా ఏబీఎన్ మీద కేసులువేయడానికో, లీగల్ గా వెళ్లడానికో పనికి రావు. డిఫర్మేషన్ వేసినా కోర్టులో నిరూపించలేరు. అప్పటికీ పది సంవత్సరాలో 20 సంవత్సరాలో అవుతుంది. ఈలోగా వాయిదా వచ్చి ప్రతీసారి ఈ కేసును హైలెట్ చేస్తూ జగన్మోహనరెడ్డి వ్యతిరేక మీడియాలు వార్తలు రాసుకుంటాయి. ఒక రకంగా ఆయన దొరికిపోయినట్లే. ఒక ట్రోలింగ్ అంశంగా దొరికిపోయినట్లే. అందుకే లీగల్ గా వెళ్లలేదు. మరో వైపు జగన్మోహనరెడ్డి సోదరి వైఎస్ సునీతా రెడ్డి కూడా ఎక్లూజివ్ గా ఎబీఎన్ ఛానల్ తోనే మాట్లాడుతున్నారు. ఒక డాక్టర్ గా కానీ, వైఎస్ వివేకా కుమార్తె గా కానీ ఏది మాట్లాడాలన్నా వైఎస్ సునీతారెడ్డి ఏబిఎన్ తోనే మాట్లాడుతున్నారు. మరో పక్క షర్మిల కూడా ఏబీఎన్ తోనే ఇంటరాక్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ జగన్ వ్యతిరేక మీడియా అని తెలిసి కూడా వైఎస్ షర్మిల గానీ వైఎస్ సునీతారెడ్డి ఏబీఎన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే కశ్చితంగా ఒక స్ట్రాటజీ ఉన్నట్లే చెప్పుకోవచ్చు. ఆ స్ట్రాటజీలో వైఎస్ జగన్మోహనరెడ్డి ఇరుక్కుపోయినట్లే స్పష్టంగా తెలుస్తోంది.


Share

Related posts

‘విశాఖ భూకుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయాలి’

somaraju sharma

నా ప్రమేయం ఉంటే ఉరితీయండి

sarath

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కీలక పరీక్ష..!

Muraliak