Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో కంటెస్టెంట్ సన్నీ గురించి ఎవరికీ తెలియని వాస్తవాలు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్.. అన్ని సీజన్లలో కంటే అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని అందరూ అంటున్న తరుణంలో షోకి ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్ సన్నీ(Sunny) అని చెప్పవచ్చు. టాస్క్ పరంగా లేదా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని విధాలా ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచాడు. ప్రియ ఆంటీతో ఏడో వారం లో గొడవలు అంతకుముందు…టాస్క్ లలో… దూకుడుగా ఆడటంతో బిగ్ బాస్(Bigg Boss) షో చూడటానికి వీక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించినట్లు అయింది. దీంతో మనోడు గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. నిజ జీవితంలో సన్నీ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడని… నటన అంటే చిన్ననాటి నుండి.. చాలా ఇష్టమట.  స్కూల్ నుండే.. సన్నీ అనేక నాటకాల్లో నటించడం జరిగిందట. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. చిన్న వయసులో తండ్రి మరణించడంతో తల్లి పెంచడం జరిగింది.

Bigg Boss Telugu 5 contestant VJ Sunny: All you need to know about the journalist-turned-actor - Times of India

సన్నీకి ఇద్దరు అన్నయ్యలు. హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన సన్నీ మొదటిలో యాంకరింగ్ ఆ తర్వాత న్యూస్ రిపోర్టర్…గా రాణించి అనేక మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన సన్నీ.. మెల్లమెల్లగా సీరియల్ లో.. అవకాశాలు అందుకోవడం జరిగిందట. ఆ రీతిగా సీరియల్స్ లో ఛాన్సెస్ అందుకున్న సన్నీ…తనకంటూ గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. అంతమాత్రమే కాకుండా షూటింగ్ జరుగుతున్న విరామ సమయంలో ఏదైనా బైక్ లేదా మంచి కార్ కనబడితే ఖచ్చితంగా సన్నీ రైడ్ కి వెళ్ళటం జరుగుతుందట. బైక్స్ కార్లంటే సన్నీకి చాలా ఇష్టమని టాక్. సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. 1989లో ఖమ్మం జిల్లాలో పుట్టడం జరిగింది. మాటీవీలో ఇంకా పలు ప్రముఖ ఛానల్స్ లో యాంకరింగ్ చేసిన సన్నీ…టాప్ మోస్ట్ సీరియల్స్ లో అవకాశాలు అందుకుని… తనకంటూ టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నీ… జూనియర్ ఎన్టీఆర్ గా.. సీరియల్స్ లో పేరు సంపాదించటం జరిగింది. అంతేకాకుండా పలు సినిమాలలో కూడా అవకాశాలు సన్నీకి వస్తున్నాయి. ఇంతటి భారీ క్రేజ్ ఉండటంతోనే సన్నీకి బిగ్ బాస్ హౌస్ లో అవకాశం రావడం జరిగిందట. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారందరిలో కల్లా… బిగ్ బాస్ టైటిల్ గెలిచే సత్తా సన్నీకి ఉందని ఏడవ వారం తర్వాత బయట జనాలు బలంగా చెప్పుకుంటున్నారు.

Bigg Boss Telugu 5: Kalyana Vaibhogam fame VJ Sunny likely to take part in the upcoming season - Times of India

ఫిజికల్ గా అయితే విశ్వ….

ఫ్రెండ్షిప్ పరంగా కూడా మానస్ తో.. చాలా క్లోజ్గా ఉంటూ.. ఎక్కడా కూడా మాస్కు ధరించిన గేమ్ ఆడకుండా.. సన్నీ ఆట తీరు ఉందని జనాలు చెబుతున్నారు. లేడీస్ కి వ్యాల్యూ చేస్తూనే మరో పక్క ఫైట్ చేస్తూ సన్నీ.. హౌస్ లో కీలకంగా రాణిస్తున్నారని.. ఆడియన్స్ అంటున్నారు. ప్రతి సమయంలో గేమ్ ఆడుతూ మరోపక్క… హౌస్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ సన్నీ తనదైన శైలిలో.. హౌస్ లో రాణిస్తున్నారని చెప్పుకుంటున్నారు. సన్నీ మాదిరి గేమ్ గత సీజన్లో ఎవరు ఆడలేదని… ఇదే ఫామ్ కొనసాగిస్తూ ముందుకు వెళితే బిగ్బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ట్రోఫీ గెలవటం.. గ్యారెంటీ అని చెబుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులలో సన్నీకి మంచి పోటీ ఇచ్చే.. కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే రవి, షణ్ముఖ్ జస్వంత్.. మాత్రమే అని ఫిజికల్ గా అయితే విశ్వ అని… వీరిని దాటుకొని వెళితే ఇక సన్నీకి తిరుగుండదు కచ్చితంగా సీజన్ ఫైవ్ ట్రోఫీ సన్నీ… గెలవటం పక్కా అని జనాలు.. చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం హౌస్ లో  కెప్టెన్ గా… రాణిస్తున్న సన్నీ ఇదే జోరుతో… దూసుకుపోతే తిరుగుండదని, కచ్చితంగా.. సీజన్ ఫైవ్ కి… సన్నీ గేమ్ హైలెట్ అని బయట జనాలు భారీ ఎత్తున చర్చించుకుంటున్నారు.


Share

Related posts

Pawan Kalyan : ఏపిలో పుర ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందన ఇదీ

somaraju sharma

బిగ్ బాస్ 4: నామినేషన్ లో ఉన్న ఈ ఇద్దరు కచ్చితంగా బయటకు వెళ్లరు..!!

sekhar

Hibiscus: మందారం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!!

bharani jella