అబుదాబీ నుండి భారత్ కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ కు పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అబుదాబీ నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఈ ఉదయం కాలికట్ (కోజికోడ్) బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా, ఒక ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజన్ నుండి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై ఫ్లైట్ ను వెనక్కు మళ్లించి అబుదాబీ ఎయిర్ పోర్టులోనే సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారులు వెల్లడించారు. వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా, మొదటి ఇంజన్ లో మంటలు చెలరేగడాన్ని గుర్తించి విమాన సిబ్బంది వెంటనే అబూదాబీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ ప్రకటనలో తెలిపింది.

ఎయిరిండియా విమానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో గత నెల రోజుల వ్యవధిలో ఇది మూడవది. జనవరి 23న తిరువనంతపురం నుండి మస్కట్ వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో కంప్యూటర్ సిస్టమ్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి మళ్లించారు. ఆ తర్వాత జనవరి 29న షార్జా నుండి వస్తున్న విమానంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. గత ఏడాది డిసెంబర్ నెలలోనూ దుబాయ్ కి వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ లో పాము కలకలాన్ని రేపింది. కాలికట్ నుండి దుబాయ్ కి విమానం వెళ్లగా, అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్ లో పామును గుర్తించారు.
Adani Enterprises Rout Row: ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు