24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కుంభకోణం కేసులో మహిళా ఆర్డీఓ అరెస్టు

Share

ఏపిలోని నెల్లూరు పౌరసరఫరా సంస్థ( సివిల్ సప్లైస్ కార్పొరేషన్) లో జరిగిన భారీ అవినీతి కేసులో ప్రమేయం ఉన్నట్టు ప్రాధమికంగా తేలడంతో గతంలో గతంలో అక్కడ మేనేజర్ గా పని చేసి ప్రస్తుతం సూళ్లూరుపేట ఆర్ డీ ఓ గా బాద్యతలు నిర్వహిస్తున్న కెఎం రోజ్ మండ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో కోట్ల రూపాయలు రోజ్ మండ్ వెనకేసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో ఆర్డీఓను అరెస్టు చేయడంతో కీలక ముందడుగు పడినట్లు అయ్యింది.

Sullurupeta RDO Rosemond

 

అమె అవినీతికి పాల్పడినట్లుగా పూర్తి ఆధారాలు లభించడంతో ఆమె అరెస్టునకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనుమతి తీసుకున్న ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పర్చగా, కోర్టు ఆమెకు జనవరి 4వ తారీ వరకు రిమాండ్ విధించినట్టు సమాచారం. ఈ కేసులో ఆర్డీఓ రోజ్ మండ్ అరెస్టు తో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడు శివకుమార్ (ఔట్ సోర్సింగ్ ఉద్యోగి) తో పాటు మరో 12 మందిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. నిందితులకు సంబంధించి పలు చోట్ల ఉన్న ఆస్తులను గుర్తించి సీజ్ కూడా చేశారు. త్వరలో ఈమెకు సంబంధించిన ఆస్తులు కూడా గుర్తించి జప్తు చేసే విధంగా చర్యలు చేపడతారని సమాచారం.

 

నెల్లూరు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లో రూ.29 కోట్ల కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్రాధమిక నివేదికలో తేల్చింది. 2017 నుండి అవినీతి వ్యవహారాలు జరిగినట్లుగా గుర్తించింది. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లో ముఖ్యమైన అధికారులతో పాటు ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయిన వారిని ఏసీబీ అధికారులు విచారణ చేస్తొంది. ఈ కేసులో ఐఎఎస్ అధికారుల పాత్ర పైనా ఆరా తీస్తున్నది.

కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్ లో నాలుగు వెలుగు చూశాయి


Share

Related posts

ఇన్నాళ్ళకి టాప్ సీక్రెట్ రివీల్ చేసిన శృతి హాసన్ ..!

GRK

West Bengal Politics: పశ్చిమ బెంగాల్ లో మరో ప్రహసనం:పీఎం, సీఎంల మధ్య నలిగిపోతున్న సీఎస్!!

Yandamuri

బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ ని చూస్తే నా బ్రదర్ గుర్తొస్తాడు అంటున్న మాస్టర్…!!

sekhar