అచ్చెన్నాయుడే వద్దన్నాడా? నారా వారే ఆయనను వద్దనుకున్నారా?

టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భర్తీ చేయకుండా వుంచేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Chandrababu Naidu's son Nara Lokesh to lead Andhra delegation to World Economic Forum - india news - Hindustan Times

ఆదివారం నాడు టిడిపి 25 పార్లమెంట్ స్థానాల అధ్యక్షులను చంద్రబాబు ప్రకటించడం తెలిసిందే.అలాగే రెండేసి పార్లమెంటు స్థానాలకో సమన్వయకర్తను కూడా చంద్రబాబు నియమించారు.ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా భర్తీ చేస్తారని, మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుకు ఆ పదవిని ఇవ్వబోతున్నారని విస్తృతంగా ప్రచారం సాగింది.అయితే ఆ ముచ్చట లేకుండానే చంద్రబాబు పదవుల పందేరాన్ని ముగించారు.

ఆఖరి నిమిషం లో చంద్రబాబు ఎందుకు ఇలా వెనకంజ వేశారన్న విషయం టిడిపి వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం.అచ్చన్నాయుడు కి పదవి ఇవ్వకుండా చినబాబు అడ్డుకున్నారని ఒక టాక్ .ఈఎస్ఐ స్కామ్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన అచ్చెన్నాయుడిపై చంద్రబాబుకు సానుభూతి బాగా పెరిగింది. అందుకే ఆయననే టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమించాలని అనుకున్నాడట.. ఈ మేరకు తన అనుకూల మీడియా ద్వారా బాగానే ప్రచారం చేయించారు.ఆదివారమే ఈ ప్రకటన జరుగుతుందని అందరూ భావించారు.అయితే అధ్యక్ష పదవి మినహాయిస్తే మిగిలిన పదవులన్నింటినీ చంద్రబాబు ఆదివారం భర్తీ చేశారు.

అచ్చెనాయుడుకు ఇలా చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడం పార్టీ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది.ఇలా ఎందుకు జరిగిందన్న విషయమై రాజకీయ పరిశీలకులు విశ్లేషణ సాగిస్తున్నారు.ఇవ్వాలనుకుంటే అచ్చెన్నాయుడికి పదవి ఇచ్చేయాలి. ఈ దోబూచులాట ఏంటని పలువురు కౌంటర్ ఇస్తున్నారు.  అయితే ఈ పదవి చేపట్టడానికి అచ్చెన్నాయుడు ఆసక్తిగా లేడని తెలుస్తోంది.  ఈఎస్ఐ స్కాంలో తనను బలి చేశారనే ఫీలింగ్ అచ్చెన్నాయుడిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే జైలుకెళ్లొచ్చాక సైలెంట్ అయ్యాడు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. ఆ పదవి తీసుకున్నా పెద్దగా ఏమీ ఉండదు అనే భావనలో ఉన్నాడట.

మరోవైపు పదమూడు జిల్లాలకు పరిమితమైన టిడిపికి జాతీయ అధ్యక్షుడు , జాతీయ కార్యదర్శి ,రాష్ట్ర అధ్యక్షుడు వంటి పదవులు అవసరమా అన్న చర్చ కూడా పార్టీలో మొదలైంది.అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడయితే తనకు కొంచెం ఇబ్బంది అన్న ఉద్దేశ్యంతో లోకేష్ ఉన్నారట.ఇదే విషయమై తండ్రీ కొడుకుల మధ్య చర్చ జరిగిందని, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అచ్చెన్నాయుడు కి అధ్యక్ష పదవి ఇచ్చే విషయాన్ని వాయిదా వేశారని టిడిపి వర్గాలు చెప్పాయి.మరి మళ్లీ దీనికి ఇప్పుడు ముహూర్తం పెడతారో చూడాలి !