Acharya : ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ కి జంటగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుందని అంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ మూవీస్ బ్యానర్స్ లో రాం చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దేవాలయ భూముల ఆక్రమణ .. అవినీతి రాజకీయనాయకుల ఆగడాలు .. వాళ్లని ప్రశ్నించే ఓ నిజాయితీగల పౌరుడిగా చిరంజీవి నటిస్తున్నట్టు సమాచారం.
కాగా ఈ సినిమాలో ఉన్న మరో పవర్ఫుల్ పాత్ర చరణ్ చేస్తున్న సిద్ద. ఇప్పటికే ఈ పాత్ర ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక తెరపై చరణ్ కనిపించేది తక్కుసేపే అంటున్నారు. అయినా ఆ పాత్ర సినిమా లో చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. సిద్ధ గా చరణ్ పాత్ర ను కొరటాల చాలా కొత్తగా డిజైన్ చేశాడని సమాచారం. నీతి, నిజాయితీలతో కూడుకున్న యువకుడిగా చరణ్ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందట. అంతేకాదు మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ మధ్య వచ్చే సనివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని సమాచారం.
Acharya : ఆచార్య సినిమాని మే 13 న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం రాజమండ్రి లోని రంప చోడవరం మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఆచార్య షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చిరుతో పాటు చరణ్ పాల్గొంటున్నారు. ఇక్కడే అల్లు అర్జున్ – సుకుమార్ ల పుష్ప షూటింగ్ జరిగింది. కాగా ఆచార్య సినిమాని మే 13 న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అధికారకంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇక చరణ్ ఆచార్య సినిమాతో కూడా రాబోతున్నాడు. ఆచార్య తర్వాత మెగాస్టార్ మోహన్ రాజా దర్శత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు.