Acharya: అవన్నీ పుకార్లేనని ఆచార్య తేల్చేశాడు..

Share

Acharya: కరోనా ప్యాండమిక్ నుంచి కాస్త పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత టాలీవుడ్‌లో వరుసగా సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ డేట్ లాక్ చేసుకొని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాల మధ్య భారీగానే పోటీ నెలకొంటోంది. దాంతో ఒకేసారి రెండు సినిమాలు క్లాష్ అవుతున్నాయి. అలాగే వారం గ్యాప్ లేకుండానే సినిమాలు రిలీజ్ చేయాలని ఆరాట పడుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు సేఫ్‌సైడ్‌గా తమ సినిమాలకు అంత పోటీ లేకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు.

acharya-movie unit gave clarity regarding release date

ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలకు రిలీజ్ డేట్ లాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పోస్ట్‌పోన్ చేయాల్సి వస్తోంది. వాస్తవంగా సర్కారు వారి పాట, గని చిత్రాలు అలా పోస్ట్‌పోన్ చేసుకున్నవే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మారబోతోందనే టాక్ ఈ మధ్య మొదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

Acharya: మళ్ళీ రీషూట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు..

ఈ సినిమాకు కొన్ని సీన్స్ మళ్ళీ రీషూట్ చేయబోతున్నారని గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా ఆచార్య బృందం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆచార్య చిత్రాన్ని ముందు ప్రకటించిన తేదీ ఫిబ్రవరి 4న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తాజాగా తెలిపిన అప్‌డేట్‌లో పేర్కొన్నారు. దీనితో ఆచార్య సినిమా రీషూట్ విషయంలో రిలీజ్ డేట్ మారనుందనే విషయంలో వచ్చినవన్ని పుకార్లని తేలిపోయింది.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

22 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago