Acharya : కోవిడ్ కారణంగా మళ్ళీ మూడు నెలలుగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ లేక ఇండస్ట్రీ మొత్తం వెలవెల పోయింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు కాస్త మారుతున్నాయి. కోవిడ్ కేసులు కాస్త అదుపులోకి వస్తుండటంతో నెమ్మదిగా లాక్ డౌన్ వేళల్లో మార్పు వచ్చాయి. దాంతో ఇండస్ట్రీలో మళ్ళీ పూర్వ వైభవం కనిపించబోతోంది. త్వరలో సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల చిత్ర బృందాలు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. రాధే శ్యామ్ సినిమాకి, రవితేజ ఖిలాడి, బాలయ్య అఖండ సినిమా, నాగ చైతన్య థాంక్యూ సినిమాలకి వారం నుంచి పదిరోజుల షూటింగ్ మాత్రమే చేయాల్సి ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేశారు. రాం చరణ్, పూజా హెగ్డే మీద ఒక సాంగ్, కొన్ని సీన్స్ మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలయిన పోస్టర్లు, లాహే లాహే సాంగ్, మెగాస్టార్ లుక్, చరణ్ లుక్ ఆచార్య మీద అంచనాలు బాగా పెంచాయి. డేట్ అనుకున్న దాని ప్రకారం అయితే ఈ పాటికే ఆచార్య రావాల్సింది. కరోనా వల్ల పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. కాగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ఒక భాగాన్ని రిలీజ్ చేయనున్నారు.
Acharya : ఈ రెండు సినిమాల నుంచి పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్స్ రానున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని అంటున్నారు. కానీ ఇంకా దానికి సంబంధించిన అధికారకమైన ప్రకటన రావాల్సింది. అలాగే పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఆగస్టు 13న వస్తుందంటున్నారు. కాని ఇప్పుడు ఆ డేట్ మారి కొత్త డేట్ ని ప్రకటిస్తారట. అయితే త్వరలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాల పబ్లిసిటీ మొదలు పెట్టనున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఈ రెండు సినిమాల నుంచి పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్స్ రానున్నట్టు తెలుస్తోంది.