Acharya: ఆచార్య రిలీజ్ డేట్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Share

Acharya: చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆచార్య.. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ గా, పూజా హెగ్డే నీలాంబరి సందడి చేయనున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. తాజాగా సినిమాను మే 13న విడుదల చేయడం లేదంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్..

Acharya: release date postponed
Acharya: release date postponed

ఈ సినిమాలో ఒకే ఆశయం కోసం కలిసి పోరాడే యోధుడిగా చిరంజీవి చరణ్ కలిసి కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంతేకాకుండా ఇంతవరకు ఫ్లాప్ అనే పేరు తెలియని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.. గత సంవత్సరం లాక్డౌన్ వలన వాయిదా పడిన ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఇంతలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభించడం షూటింగ్ ఆగిపోవడం, ఇండస్ట్రీలో పరిస్థితి తలకిందులు కావడంతో, సినిమా మళ్లీ వాయిదా పడింది. కొద్దిరోజులుగా ఆచార్య చిత్రం వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో మెగా అభిమానులు నిరాశపడ్డారు.. కానీ కొత్త రిలీజ్ డేట్ మెగాస్టార్ పుట్టినరోజు ఆగస్టు 22న అని ఊహాగానాలు రావడంతో ఉత్సాహం నెలకొంది.

ఇప్పటికే కరోనా వలన నాగచైతన్య లవ్ స్టోరీ, రానా దగ్గుబాటి విరాటపర్వం, విశ్వక్సేన్ పాగల్ రిలీజ్ డేట్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో కి ఆచార్య కూడా చేరింది.

 


Share

Related posts

బిగ్ బాస్ 4: ట్రెండ్ సెట్ చేస్తున్న అభిజిత్..!!

sekhar

పూజా హెగ్డే బాలీవుడ్ లో కియారా కి చెక్ పెట్టబోతుందా ..?

GRK

Eatela Rajendar: ష‌ర్మిల పార్టీలోకి ఈట‌ల‌.. ఇంత‌కంటే దౌర్భాగ్యం ఏముంటుంది?

sridhar