Maa Poll: “మా” అధ్యక్ష ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇప్పటికే లోకల్ – నాన్ లోకల్.. అదే రీతిలో “మా” అసోసియేషన్ బిల్డింగ్ వంటి విషయాల గురించి గ్రూపులు గ్రూపులుగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఏకంగా ఈసారి ఐదుగురు సభ్యులు పోటీ చేస్తూ ఉండటంతో మా అధ్యక్ష పదవి ఎవరికి వస్తుంది అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యుల లో పోటీదారులు నటి హేమ.. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పై వైరల్ కామెంట్ చేసింది. కొంతమంది “మా” అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాలని కోరుకుంటున్నట్లు నటి హేమ ఆరోపించింది.
ఆ విధంగా కోరుకునేవాళ్లు.. మళ్లీ మా అధ్యక్ష పదవి.. నరేష్ కే పరిమితం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసినట్లు ఆమె పేర్కొంది. ఇదే తరుణంలో అధ్యక్ష పదవి నుండి దిగకుండా నరేష్ కూడా మరోపక్క ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక నరేష్ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో.. అసోసియేషన్ లో ఐదు కోట్ల నిధులలో… కేవలం మూడు కోట్ల మాత్రమే.. నరేష్ ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగిందని మిగతా డబ్బంతా ఏమైంది అని నటి హేమ ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టి ప్రసక్తి లేదని ఇప్పటికే అసోసియేషన్ లో ఉన్న 200 మంది సభ్యులకు లెటర్ రాసినట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో మా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది వాయిదా పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని.. కూడా లెటర్ లో వారందరి చేత సంతకాలు హేమ సేకరించటం జరిగింది.