NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

టీడీపీకి కాబోయే అధ్యక్షుడు, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్..?

 

దివంగత ముఖ్యమంత్రి, నాటసార్వభౌమ నందమూరి తారక రామరావు మనవడిగా తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన ముద్రవేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల సమయంలోనూ టీడీపీ సర్కిల్ లో   జూనియర్  ఎన్టీఆర్ పేరు వినపడుతూనే ఉంది. గతంలో జరిగిన పలు ఎన్నికల సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనలేదు.

జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుభాషిని హైదరాబాద్ కూకట్‌పల్లి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు. దూరంగానే ఉన్నారు. పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు.  అయితే పలు సందర్భాలలో రాజకీయాలకు తన వయసు సరిపోదనీ, ప్రస్తుతం సినీరంగంలో బిజీగా ఉన్నాననీ. తన తాత స్థాపించిన పార్టీ టీడీపీ క్షేమమే కోరుకుంటాననీ జూనియర్ వెల్లడించారు. టీడీపీకి దూరం అవుతున్నారని అప్పట్లో వచ్చిన ప్రచారాన్ని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కొట్టిపారేశారు.  అయితే నందమూరి అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగ్రేటం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తునే ఉన్నారు.

ఇప్పుడు తాజాగా ఏపి రాజకీయాల్లో ఓ ఫ్లెక్సీ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  రాబోయే కాలానికి కాబోయే సీఎం.2024 నెక్స్ట్ ఏపీ సీఎం  జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి, స్థానిక టీడీపీ నాయకుల ఫోటోలు ఉండటం గమనార్హం. ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju