ప్రముఖ నటుడు ఖాదర్ ఖాన్ పరిస్థితి విషమం

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. బాలీవుడ్ లో దాదాపు 300 సినిమాలలో నటించిన ఆయన ప్రస్తుతం కెనడాలోని తన కుమారుడు, కోడలితో కలిసి నివసిస్తున్నారు. శ్వాస సంబంధమైన ఇబ్బందితో ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఖాదర్ ఖాన్ నటించిన సినిమాలలో రంగ్, ఆగ్, అంజాన్, డాన్  వంటి చిత్రాలున్నాయి. ఆయన 2017లో చివరిసారిగా మస్తీ నహీ సస్తి సినిమాలో నటించారు.