మంచి నాయకులను ఎన్నుకోవాలి : సుమన్

59 views

తిరుపతి, ఫిబ్రవరి 24: ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని ప్రముఖ సనీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మిడియాతో కొద్ది సేపు మాట్లాడారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని సుమన్ అవేదన వ్యక్తం చేసారు.  ప్రజలు అభిమానంతో ఓట్లు వేసే పరిస్థతి కనబడటం లేదనీ, ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థతి ఉందని సుమన్ అన్నారు.

ప్రజలు అలోచించి సమాజానికి, ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఓట్లు వేసి గెలిపించుకోవాలని సుమన్ హితవుపలికారు.