‘పందెంకోడి’ అరెస్ట్

Share

చెన్నై: ప్రముఖ చలనచిత్ర నటుడు , తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు (పందెంకోడి ఫేం) విశాల్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. నిర్మాతలకు, విశాల్‌కు  మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో ఈ అరెస్ట్‌ జరిగింది.  టి.న‌గ‌ర్‌లో ఉన్న నిర్మాతల మండలి కార్యాలయం త‌లుపులను బ‌ల‌వంతంగా తెరిచేందుకు విశాల్ ప్ర‌య‌త్నించడం, ఈ నేపథ్యంలో నిర్మాతలకు, విశాల్ కు  మధ్య ఉద్రిక్తత పరిస్థితులు  నెలకొనే అవకాశం ఉందని భావించిన పోలీసులు విశాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక తైనాంపేట పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.  ఇటీవల  తమిళ  సినీ నిర్మాతల సంఘంలో తలెత్తిన సంక్షోభం మరింతగా పెరిగింది.  ఈ వివాదం నేపధ్యంలో కొందరు నిర్మాతలు బుధవారం  ఆందోళన చేపట్టారు. నిర్మాతల మండలి అధ్యక్షులు విశాల్ నేడు కార్యాలయానికి  రావడం, కొందరు నిర్మాతలు కార్యాలయానికి తాళాలువేసుకుని లోపలే ఉండటంతో విశాల్ తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్ళాలని యత్నించారు. ఈ నేపథ్యంలో బందోబస్తు చేపడుతున్న పోలీసులు వివాదం మరింత ముదరకముందుగానే విశాల్ ను అరెస్టు చేశారు.  తన అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించిన విశాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  ఈ సంఘటనపైన న్యాయపోరాటం చేస్తామని విశాల్ తెలిపారు.

విశాల్ అరెస్టు వార్త సినిమా పరిశ్రమలో సంచలనంగా మారింది. తమిళంతో పాటుగా తెలుగులోకూడా తన సినిమాలను ప్రదర్శించి ప్రేక్షకులకు చేరువైన విశాల్ అనేక వివిదాస్పద విషయాల్లో తలదూర్చి వార్తల్లో  ఉంటారన్న టాక్  ఇండస్ట్రీలో వుంది.

అసలు కారణం

సరైన హిట్‌లు లేక నటుడుగానే కాకుండా నిర్మాతగా మారిన విశాల్ అనతికాలంలోనే తమిళ సినిమారంగంలో  కీలక వ్యక్తిగా మారారు.  సహనటులకు అవసరమైనప్పుడు ఆర్ధిక సహాయ సహకారాలను అందజేస్తూ నిర్మాతల మండలి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.  పైరసీ సినిమాలకు సంబంధించిన వెబ్ సైట్ తమిళ రాకర్స్ లో విశాల్ కు వాటా  ఉందన్నది  కొందరు తమళ నిర్మాతలు   ఆరోపిస్తూ  కార్యాలయం వద్ద  ఆందోళన చేపట్టారు. తమిళ చిత్రపరిశ్రమలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా విశాల్ ప్రధానమైన పైరసీకి అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలం చెందారని నిర్మాతలు ఆరోపించారు. అధ్యక్ష పదవినుంచి విశాల్ తప్పుకోవాలని నిర్మాతలు కొందరు డిమాండ్ చేస్తూ  ఆందోళన చేపట్టడం చివరకు విశాల్ అరెస్టుకు దారితీసింది.


Share

Related posts

జ‌గ‌న్ స‌ర్కారు కూలిపోతుందా…. కుట్ర చేస్తోంది ఎవ‌రు?

sridhar

HBD Ram Charan : మెగాస్టార్ చిరంజీవి – చెర్రీ బర్త్ డే సందర్భంగా పోస్ట్ చేసిన స్పెషల్ వీడియో అదుర్స్..

bharani jella

కృష్ణంరాజు రెచ్చిపోవడం వెనక “ఆ ఢిల్లీ నేత ఇచ్చిన ధైర్యం”?

Yandamuri

Leave a Comment