Subscribe for notification

నేను హీరో అవుతానంటే అద్దంలో ముఖం చూసుకో అన్నారు? సీనియర్ యాక్టర్ భాను చందర్

Share

సీనియర్ యాక్టర్లు భాను చందర్, సుమన్ గుర్తున్నారా మీకు. అప్పట్లో కరాటే, మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ సినిమాలు అంటే భాను చందర్, సుమన్ లే గుర్తొస్తారు. వాళ్లిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. హీరోలుగానూ చాలా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తున్నారు సుమన్, భాను చందర్.

Actors Suman and Bhanu Chander in alitho saradaga

వీళ్లిద్దరి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియనివి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే.. వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే.. సుమన్ ను తెలుగు సినిమా తెరకు పరిచయం చేసిందే భాను చందర్. సుమన్.. తన సినిమా కెరీర్ ను తమిళ్ లో ప్రారంభించగా… తర్వాత భాను చందర్ సహాయంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

వీళ్లిద్దరు ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వాళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని, వాళ్లు కలిసి నటించిన సినిమాల గురించి ఆలీతో పంచుకున్నారు.

సుమన్ కు తెలుగులో నచ్చిన సినిమా అన్నమయ్య అట. సుమన్ కు 8 భాషలు వస్తాయట. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, తుళుతో పాటు హిందీ, ఇంగ్లీష్ లో సుమన్ అనర్గళంగా మాట్లాడగలరు. కాకపోతే సుమన్ తమిళంలో మాత్రమే తన సినిమాకు డబ్బింగ్ చెప్పారు కానీ.. మిగితా భాషల్లో వేరే ఆర్టిస్టుతో డబ్బింగ్ చేయించారు. తెలుగులో అయితే ఫస్ట్ ఒక సినిమాకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పడంతో… ఆ తర్వాత అలాగే సాయికుమార్ డబ్బింగ్ ను కంటిన్యూ చేశారు.

భాను చందర్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కొడుకు. తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో.. తనను కూడా గిటార్ నేర్చుకొని.. మ్యూజిక్ లోనే స్థిరపడాలని అందరూ అన్నారట. కానీ.. భాను చందర్ మాత్రం హీరో అవుతానంటే అందరూ నవ్వారట. ఒకసారి ముఖం అద్దంలో చూసుకో అన్నారట. కానీ.. భాను తల్లి మాత్రం లేదు లేదు.. నువ్వు హీరో అవుతావు.. ట్రై చేయ్ అని చెప్పిందట. దీంతో సినిమాల్లో ట్రై చేసి తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు భాను చందర్.

అలాగే.. అన్నమయ్య సినిమాలో సుమన్ ది మంచి క్యారెక్టర్ అయినా తనకు ఏ అవార్డు రాలేదు. ఎందుకు ఆయనకు ఆ సినిమాకు అవార్డు రాలేదో ఆలీతో సుమన్ పంచుకున్నారు. అలా.. ఇండస్ట్రీలో సుమన్ ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. భాను చందర్ కొన్ని ఏళ్ల తర్వాత సినిమాలు ఎందుకు మానేశారు? అనే విషయాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి.


Share
Varun G

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

12 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

12 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

24 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago