చింతమనేని మనుషులు వేధిస్తున్నారు!

హైదరాబాద్‌ , డిసెంబర్ 24 : దెందులూరు (టీడీపీ) ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు తనను వేధిస్తున్నారని సినీ నటి అపూర్వ పోలీసులను ఆశ్రయించారు. లోగడ తాను చింతమనేనిపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచకుని ఆయన అనుయాయులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని అపూర్వ హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే మనుషులపై తగిన చర్యలు తీసుకోవాలని అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.