ట్రెండింగ్ న్యూస్

Alitho Saradaga : తన క్రష్ గురించి ఆలీకి చెప్పేసిన లావణ్య త్రిపాఠి?

actress lavanya about her crush in alitho saradaga show
Share

Alitho Saradaga : ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా. తెలుగు బుల్లితెర మీద ప్రస్తుతం టాప్ లో ఉన్న టీవీ షో ఇది. యాక్టర్ ఆలీ.. హోస్ట్ గా వచ్చే షో కాబట్టి ఈ షోకు ఉన్న క్రేజ్ వేరు. అలాగే… ఈ షోకు వచ్చే గెస్టులు కూడా సెలబ్రిటీలు కావడంతో… ఈ షోకు రేటింగ్స్ పైనే ఉంటున్నాయి. ఈ షోను కూడా ఆధ్యంతం సరికొత్తగా తీర్చిదిద్దింది ఈటీవీ.

actress lavanya about her crush in alitho saradaga show
actress lavanya about her crush in alitho saradaga show

జబర్దస్త్ కామెడీ షోకు దీటుగా ఈ షో నడుస్తోంది. అందుకే ఈ షోకు అంత క్రేజ్. తాజాగా ఈ షోకు చావు కబురు చల్లగా హీరో, హీరోయిన్స్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి వచ్చారు. వాళ్లిద్దరు కలిసి ఈ షోలో చేసిన హంగామానే వేరు.

నిజానికి హీరో కార్తికేయ చాలా సింపుల్ గా ఉంటాడు. ప్రస్తుతం పెద్ద స్టార్ హీరో అయినా కూడా సింప్లిసిటీ మెయిన్ టెన్ చేస్తాడు. లావణ్య త్రిపాఠి కూడా అంతే. తను ఎంతో అందంగా ఉంటుంది. అయినప్పటికీ.. చాలా సింపుల్ గా ఉంటుంది.

Alitho Saradaga : తన మనసులో మాటను ఈ షో ద్వారా బయటపెట్టిన లావణ్య

ఆలీతో సరదాగా షో అంటేనే.. ఈ షోకు వచ్చే సెలబ్రిటీలు తమ అభిమానులకు తెలియని సీక్రెట్లను బయటపెడుతారు. హోస్ట్ ఆలీ కూడా అన్నీ అటువంటి ప్రశ్నలే వేస్తాడు. కష్టమైన ప్రశ్నలు వేసి… షోకు వచ్చిన సెలబ్రిటీలను ఇరుకున పెడతాడు.

ఈ షో తాజా ఎపిసోడ్ కు వచ్చిన కార్తికేయ, లావణ్య త్రిపాఠీలను ఆలీ చాలా ప్రశ్నలు వేశాడు. తెలుగు ఇండస్ట్రీలో నీ క్రష్ ఎవరు? అని ఆలీ… లావణ్యను ప్రశ్నిస్తాడు. దీంతో.. నాకు ఎవరూ క్రష్ లేరు అని లావణ్య అనగానే… అవునవును… అందరినీ అన్న అని పిలిచాక… ఇక క్రష్ ఎవరు ఉంటారు? అంటూ ఆలీ కూడా భలే పంచ్ ఇచ్చాడు లావణ్యకు.

అంటే… తెలుగు ఇండస్ట్రీలోనే ఇంతమంది కుర్ర హీరోలు ఉన్నా… ఒక్కరంటే ఒక్కరు కూడా లావణ్యకు నచ్చలేదా? అంతేగా.. అంతేగా. తాజాగా విడుదలైన ఆలీతో సరదాగా లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసేయండి.


Share

Related posts

విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకుంటున్న ‘భూదందా’ వివాదం !

Yandamuri

Printed Covers: క్యారీ బ్యాగ్ కి డబ్బులడిగితే ఫైన్ మోతమోగక తప్పదు!!

Naina

Aamani: గెస్ట్ హౌస్ కు వచ్చేయ్ అన్నారు.. వాళ్లపై సీనియర్ నటి ఆమని బిగ్ బాంబ్..!

somaraju sharma