జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో తెలుసు కదా. గత ఏడేళ్ల నుంచి సూపర్ సక్సెస్ గా నడుస్తోంది. తెలుగులో ఆ షోకు దీటైన షో మరోటి లేదు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ లో ఒక్కసారైనా నటించి నవ్వించాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు కానీ.. ఆ కలలను సాకారం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. నవ్వించడం అంత తేలిక కాదు కూడా.

సినిమాల్లో నటించే పెద్ద పెద్ద కమెడియన్లు కూడా జబర్దస్త్ లో నవ్వించలేకపోయారు. అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు వచ్చి కాసేపు కామెడీ చేసి వెళ్తుంటారు.
అయితే.. జబర్దస్త్ లో చాలామటుకు లేడీ గెటప్ లు వేసి చేస్తుంటారు. అయితే ఈ మధ్య మాత్రం కొందరు సీరియల్ హీరోయిన్లు వచ్చి చేస్తున్నారు. హైపర్ ఆది, రాకింగ్ రాకేశ్, సుడిగాలి సుధీర్ లాంటి టీమ్ లీడర్లు.. తమ స్కిట్లలో పలువురు హీరోయిన్లు, టీవీ సీరియల్ హీరోయిన్లు, మోడల్స్, యాంకర్స్ ను తీసుకొచ్చి వాళ్లతో స్కిట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి మాత్రం ప్రస్తుతం ప్రతి వారం కనిపిస్తోంది. ఆమెతో పాటు.. మరో నటి వర్ష కూడా ఇప్పుడు ఎక్కువగా స్కిట్లు చేస్తోంది. హైపర్ ఆది, రాకింగ్ రాకేశ్, కెవ్వు కార్తీక్ స్కిట్లలో ఆమె మెరుస్తూంది.
అయితే.. తను అందగత్తె కూడా. జబర్దస్త్ స్టేజి మీద వయ్యారాలు పలుకుతోంది. తన అందాన్ని కనువిందు చేస్తోంది. దీంతో.. తను ఎవరు? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

నిజానికి వర్ష కూడా నటినే. ఈటీవీలో వచ్చిన ప్రేమ ఎంత మధురం సీరియల్ లో తను నటించింది. మోడల్ గా రాణిస్తున్న వర్ష.. ప్రస్తుతం డ్యాన్సర్, నటిగా పేరు పొందింది.

అప్పుడప్పుడు ఇలా జబర్దస్త్ స్కిట్లలో మెరిసి తన పాపులారిటీని పెంచుకుంటోంది. తాజాగా విడుదలైన ప్రోమోలోనూ రాకింగ్ రాకేశ్, ఇమ్మాన్యుయేల్ స్కిట్లలో మెరిసి బాగానే మెప్పించింది.
ఇంకెందుకు ఆలస్యం.. వచ్చే వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోను చూసేయండి మరి..