NewsOrbit
న్యూస్

ప్రజాప్రతినిధి వీరంగం !ఇంకా షాక్ నుండి తేరుకోని ఆదిలాబాద్ !!

తుపాకీ మోత.. బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.. అసలు ఏం జరుగుతుందో తెలియక కాసేపు అక్కడంతా గందరగోళం నెలకొంది. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఓ ప్రజాప్రతినిధి.. విచక్షణ కోల్పోయాడు. తుపాకీ, కత్తులతో హల్‌చల్‌ చేశాడు.

చిన్నపాటి గొడవను సదరు నేత పెద్దది చేసి పారేశాడు. ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రజాప్రతినిధి అన్న హోదా పక్కన పెడితే.. అసలు మనిషేనా అన్న రీతిలో ప్రవర్తించాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరపడమే కాకుండా.. అడ్డొచ్చిన వారిపై కత్తితో దాడికి దిగాడు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్ చైర్మన్‌ ఫారూఖ్ అహ్మద్‌ వైఖరితో ఆదిలాబాద్ అదిరిపడింది.తాటిగూడలో యువకుల మధ్య రేగిన క్రికెట్‌ చిచ్చు.. చివరకు కాల్పులు, కత్తిపోట్ల వరకు వెళ్లింది. పిల్లల గొడవలోకి పెద్దలు ఎంటరవడంతో.. సీన్‌ మారిపోయింది. యువకుల మధ్య క్రికెట్‌ విషయంలో జరిగిన గొడవతో.. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్‌ అహ్మద్ సహనం కోల్పోయాడు. లైసెన్స్‌డ్ గన్‌, కత్తితో రెచ్చిపోయాడు. అడ్డొస్తే అంతు తేలుస్తానంటూ వీరంగం సృష్టించాడు. అసలు ఏం జరిగిందో.. ఎందుకు జరిగిందో తెలీయకుండానే ఫారుఖ్‌ అహ్మద్ కాల్పులు జరిపాడంటున్నారు స్థానికులు. విచక్షణారహితంగా అహ్మద్ కాల్పులు జరిపిన ఘటనలో.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

జమీర్‌, మోతేషా, మన్నన్‌లపై ఫారూక్‌ అహ్మద్‌ గన్‌తో కాల్పులు చేస్తూనే.. మరో చేత్తో కత్తితో వారిపై దాడికి దిగాడు సదరు ప్రజాప్రతినిధి. ఈ దాడిలో జమీర్‌,మోతేషాకు బుల్లెట్ గాయాలు కాగా.. మన్నన్‌ బులెట్ గాయంతో పాటు కత్తిపోట్లకు గురయ్యాడు. దీంతో వారిని వెంటనే హుటాహుటిన రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ముగ్గురిలో మోతేషా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు.

ఇక ఇంతటి దారుణానికి కారణమైన అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. ఘటనకు వెనకాల ఉన్న కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ లైసెన్స్‌ రద్దు చేశారు. క్రికెట్‌ మ్యాచ్‌లో తలెత్తిన గొడవే ఈ కాల్పులకు ప్రధాన కారణమని ప్రాథమికంగా తేల్చినా.. ఘర్షణ వెనుక వేరే కారణాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇలాంటి సంఘటనలు మనం కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం.రియల్ గా కూడా ఇలాగే జరగడంతో ఆదిలాబాద్ అవాక్కయింది!

 

author avatar
Yandamuri

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju