న్యూస్ సినిమా

Adipurush 3D : ఆదిపురుష్ 3డి లేటెస్ట్ అప్‌డేట్..!

Share

Adipurush 3D : ఆదిపురుష్ 3డి..పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 3డి ఫార్మాట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకి జంటగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణ్ పాత్రల్లో నటిస్తున్నారు. భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అన్నీ సౌత్ భాషలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆ దిశగానే ఈ సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.

 

adipurush-3d- latest update
adipurush-3d- latest update

హైదరాబాద్ లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా క్యాన్సిల్ అయింది. దాంతో కొంత ఆలస్యం అయిన ఆదిపురుష్ 3డి మళ్ళీ ముంబైలో షూటింగ్ ప్రారంభం అయి శరవేగంగా సాగుతోంది. ప్రభాస్ రాధే శ్యాం, సలార్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆదిపురుష్ 3డి మాత్రం ఆగలేదు. సైఫ్ అలీఖాన్ మీద చిత్రీకరించాల్సిన కీలకమైన సన్నివేశాలను చిత్ర బృందం తెరకెక్కిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ 50 రోజులు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయిందట. ముంబైలో వేసిన భారీ సెట్‌లోనే ఈ టాకీపార్ట్ జరిపినట్టు సమాచారం.

Adipurush 3D : ఆదిపురుష్ 3డి 2022 ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్.

ఇక ఇప్పటికే ఆదిపురుష్ 3డి నుంచి ప్రభాస్, సైఫ్ అలీఖాన్ పోస్టర్స్ తో పాటు చిత్ర బృందం రిలీజ్ చేసిన మరికొన్ని ఫొటోలు ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ పాన్ ఇండియన్ సినిమా 2022 ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినట్టు అధికారకంగాను వెల్లడించాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియన్ సినిమా సలార్ చేస్తుండగా ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఇక పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న రాధే శ్యాం ఈ ఏడాది భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.


Share

Related posts

Cancer: తరచూ ఈ కంటి సమస్యలు వేధిస్తున్నాయా.!? ఈ వ్యాధి అవ్వొచ్చు..! 

bharani jella

Keerthy suresh: మెగా ఫ్యాన్స్‌కి చిరంజీవి కూడా చెప్ప‌లేనంత పెద్ద గుడ్‌న్యూస్ చెప్పిన కీర్తి సురేష్‌!

kavya N

అచ్చన్న ఇంట్లో ఏముంది!అరెస్టు తర్వాత మీడియా అంతా అక్కడే ఎందుకు ఫోకస్ చేసింది?

Yandamuri