Adipurush : ప్రస్తుతం ఎక్కడ చూసినా డార్లింగ్ ప్రభాస్ మేనియానే నడుస్తోంది. ఏదిఏమైనా బాహుబలి పుణ్యమాని ప్రభాస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఓవరాల్ పాన్ ఇండియాలో ఇపుడు ప్రభాస్ అంటే తెలియనివారుండరు. ఇక అతగాడు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఊహించని అప్డేట్ ఇచ్చారు. అవును… బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఐనటువంటి ఓం రౌత్ రామాయణం ఆధారంగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా అన్న సంగతి మనకు తెలిసినదే.
Adipurush: సర్ప్రైజ్ & షాక్ ఇదే
ఇకపోతే ఈరోజు శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని చిత్రబృందం ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్స్ తయారు చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అన్నిటినీ కలిపి మేకర్స్ ఓ వీడియోగా తయారు చేసి వదిలారు. ఇది షాక్. ఇక సర్ప్రైజ్ ఏమంటే, ఇందులో ‘ఆదిపురుష్’ విడుదల తేదీని కూడా ప్రకటించడం. అయితే, ప్రభాస్ అభిమానులు కోరుకున్న అప్డేట్ మాత్రం ఇది కాదు.
అభిమానులు కోరుకున్నది ఇదే
ఈ సినిమా ప్రకటించిన రోజునుండి ఇందులో ఆయన పోషిస్తున్న శ్రీరాముడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ గానీ, మోషన్ పోస్టర్ గానీ వస్తుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ, ఈ విషయంలో మళ్ళీ వారికి నిరాశ తప్పలేదు. అయితే దీనికి సంబందించిన అప్ డేట్ త్వరలో ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటించారు. సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో కనువిందుచేయనున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!