Adipurush :ఆదిపురుష్ Adipurush ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. ఫస్ట్ టైం ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న స్ట్రైట్ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్ని పాన్ ఇండియన్ సినిమాలు కావడం తో ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న న్యూస్ వచ్చినా వెంటనే వైరల్ అవుతంది. మేకర్స్ కూడా ప్రభాస్ సినిమాల కి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇలా సెట్స్ మీదకి వచ్చిందో లేదో అలా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని వెల్లడించారు.
దాంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ ఏడాది ఖచ్చితంగా రెండు సినిమాలను చూడబోతున్నామని ఎగ్జైటింగ్ గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రాధే శ్యాం షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దాంతో ప్రభాస్ సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలలో నటించే ఇతర తారాగణం మీద సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా కన్నడ నటుడు ని ఎంపిక చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ వైరల్ అవుతుండగానే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కి సంబంధించి మరో న్యుస్ వచ్చింది.
Adipurush : హేమమాలిని ఒప్పుకొని ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే మాత్రం హైప్ వస్తుంది.!
ఒకప్పటి డ్రీం గర్ల్ హేమమాలిని ప్రభాస్ కి తల్లిగా నటింపచేసేందుకు దర్శకుడు ఓం రౌత్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా చెప్పినట్టు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యేందుకు హేమమాలిని కూడా ఆసక్తిగా ఉందని అంటున్నారు. త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందని బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ప్రభాస్ కి తల్లిగా అంటే ఒప్పుకున్నట్టేనా అన్న టాక్ కూడా మరొక వైపు వినిపిస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. ఒకవేళ హేమమాలిని ఒప్పుకొని ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే మాత్రం ప్రాజెక్ట్ కి మరింత హైప్ వస్తుందనడం లో ఏమాత్రం సందేహం లేదు.