Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్.. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు.. మరి సీత లో నటించే హీరోయిన్ ఏం ఎవరు అనుకుంటున్నారా.. ఇప్పటివరకు పలు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి.. తాజాగా సీతాదేవి పాత్రను ఓ సౌత్ నాయిక అయితే బాగుంటుందని భావించారట మేకర్స్..
తాజా సమాచారం ప్రకారం.. సీత పాత్ర కోసం మహానటి కీర్తి సురేష్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట మేకర్స్. అయితే అధికారికంగా టీం దీనిని ప్రకటించలేదు. మహానటి తర్వాత కీర్తి సంప్రదాయబద్దమైన పాత్రలకు సూటబుల్ అని చర్చ సాగుతోంది. అందుకే ఇప్పుడు సీతగా ఆఫర్ తనని వెతుక్కుంటూ వచ్చింది అని అభిమానులు భావిస్తున్నారు. ప్రఖ్యాత టి- సిరీస్ బ్యానర్ ఈ మూవీని సుమారు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.