బొమ్మరిల్లు ఫేమ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు సినీ వర్గాలు. సీక్రెట్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారని ఎన్నో నెలలుగా వీరిపై సోషల్ మీడియాలో భారీగానే ప్రచారం అయింది. తాజాగా ఓ టాలీవుడ్ హీరో నిశ్చితార్థం వేడుకలో టాలీవుడ్ సెలబ్రిటీలు తమ భార్యలతో హాజరైతే.. సిద్ధార్థ్-అదితి జంటగా వచ్చారు. దాంతో వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని గట్టి నమ్మకం ఏర్పడింది. గతంలోనూ వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ముంబైలో ఓ హాటల్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో కెమెరాకు చిక్కింది. సోషల్ మీడియాలోనూ సిద్ధార్థ్ బర్త్ డేకు అదితి పెట్టిన పోస్టులు, వారిద్దరూ ధరించే దుస్తువులతోనూ రిలేషన్షిప్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే అధికారికంగా ఈ రూమర్లపై వీరిద్దరూ స్పందించలేదు.
హీరో సిద్ధార్థ్ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ, తమిళ చిత్రాలతో మాత్రం ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. గతేడాది ‘మహా సముద్రం’ సినిమాతో సిద్ధార్థ్ తెలుగు తెరపై కనిపించాడు. ఆ సినిమాలో హీరోయిన్గా అదితి రావు హైదరీ నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహా సముద్రం సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వీరిద్దరీ లవ్ హిట్ కొట్టన్నట్లు కనిపిస్తోంది. తమ రిలేషన్‌షిప్‌ను ఎంతో సీక్రెట్‌గా మెయిన్టైన్ చేసిన ఈ జంట.. ఈ మధ్యకాలంలో కెమెరాకు చిక్కుతున్నారు. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ కలిసి వెళ్లడం విశేషం. అయితే మొన్నటివరకు ప్రేమికులు దర్శనమిచ్చిన వీరిద్దరూ.. పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే ప్రశ్న మిగిలి ఉండేది. కానీ రీసెంట్ ఫోటో షూట్‌తో పెళ్లి చేసుకోబోతున్నారనే గట్టి నమ్మకం వస్తోంది. నెటిజన్ల కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్లో ఈ జంట మెరిసింది. వీరిద్దరూ జంటగా శర్వానంద్-రక్షితతో ఫోటోలు దిగారు. వీరు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అధికారికంగా చెప్పుకోనప్పటికీ.. ఈ విధంగా తమ రిలేషన్‌షిప్‌ను వ్యక్తపరుస్తున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీరి ఫోటోలు చూసి నెటిజన్లు కూడా కపుల్స్ లాగే కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి.. భవిష్యత్‌లో వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారా? లేదా మధ్యలోనే విడిపోతారా? అనేది.
కాగా, సిద్ధార్థ్ గతంలోని చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, సమంత, సోహా అలీ ఖాన్‌లతో రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరితోనూ సిద్ధార్థ్ సీరియస్ రిలేషన్షిప్ మెయిన్టైన్ చేయలేదు. మరోవైపు అదితి కూడా తన 21వ ఏటే సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకుని.. ఐదేళ్ల తర్వాత విడిపోయింది. కేవలం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. ఇక సిద్ధార్థ్ తో రిలేషన్‌షిప్‌పై ఎలా స్పందిస్తుందోనని నెటిజన్లు ఆతురతగా వేచి చూస్తున్నారు.