Adivi Sesh:టాలెంటెడ్ హీరో కమర్షియల్ సినిమాలకి పనికిరాడా..?

Share

Adivi Sesh: టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా అడవి శేష్‌కి మంచి పేరు ఉంది. 2002లో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆర్యన్ రాజేశ్ – నమిత జంటగా వచ్చిన సొంతం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత కర్మ అనే సినిమాను ఆయన దర్శకత్వంలో రూపొందించాడు. ఈ సినిమాకి రచయితగా కూడా పనిచేశాడు. కర్మ తెలుగు తో పాటు తమిళంలో కూడా విడుదలై మంచి పేరు దక్కింది. అప్పటి నుంచే ఇండస్ట్రీ వర్గాలలో అడవి శేష్ కి చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా, మాస్ మహారాజ రవితేజ నటించిన బలుపు సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు.

Adivi Sesh is talented hero but not suitable for commercial movies...?
Adivi Sesh is talented hero but not suitable for commercial movies…?

ఇక మరోసారి కిస్ అనే సినిమాతో వచ్చి డిఫరెంట్ జోనర్ సినిమాలు తీయడంలో అడవి శేష్ గొప్ప టాలెంట్ ఉన్నవాడని ప్రశంసలు అందుకున్నాడు. ఇదే క్రమంలో రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ సినిమాలలో నటించాడు. వీటి తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రమ్యకృష్ణ – ప్రభాస్ – రానా – అనుష్క – తమన్నా లాంటి భారీ తారాగణం నటించిన బాహుబలి సినిమాలో కీలక పాత్రలో నటించిన అడవి శేష్ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే సైజ్ జీరో లాంటి సినిమాలు చేసిన ఆయన క్షణం సినిమాతో సోలో హీరోగా బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

 

Adivi Sesh: ఇన్వాల్వ్ అవుతూ సినిమా సక్సస్ కు బాగా కారణం అవుతున్నాడు.

క్షణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. అంతేకాదు క్షణం సినిమా నుంచి అడవి శేష్‌కి విపరీతంగా క్రేజ్ పెరిగింది. అభిమానులు బాగా పెరిగారు. ఈ క్రమంలో అమీ తుమీ, గూడాఛారి సినిమాలు చేశాడు. ఒకటి పక్కా క్లాస్ మూవీ కాగా గుడాఛారి థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందింది. ఈ సినిమాతో మరింతగా ఆయన క్రేజ్ పెరిగింది. అడవి శేష్ కి 24 విభాగాల మీద మంచి గ్రిప్ ఉంది. అందుకే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వెర్షన్, కెమెరా వర్క్, ఎడిటింగ్.. ఇలా కీలక విభాగాలలో ఆయన ఇన్వాల్వ్ అవుతూ సినిమా సక్సస్ కు బాగా కారణం అవుతున్నాడు.

దర్శకుడితో కథా చర్చల నుంచే ట్రావెల్ చేసి పక్కాగా బౌండెడ్ స్క్రిప్ట్ అయ్యాకే పూర్తి నమ్మకంగా అనిపించాకే సినిమాను మొదలు పెడుతున్నాడు. అందుకే క్షణం, గూడాఛారి, ఆ తర్వాత వచ్చిన ఎవరు లాంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా మేజర్ అనే సినిమా తెరకెక్కుతోంది. 26/11 బాంబు దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ఆధారంగా రూపొందుతోంది. పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. గూడాఛారి ఫేం శశికిరణ్ తిక్క దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

Adivi Sesh: ‘మేజర్’ పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెస్తుందా..?

అయితే అడవి శేష్ కమర్షియిల్ సినిమాలకి అంతగా సూటవడని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్ని డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కినవే కావడం. అందుకే అడవి శేష్ నుంచి వెంట వెంటనే సినిమాలు రావడం లేదని అంటున్నారు. అయితే ఇప్పటికే టాలీవుడ్‌లో ఉన్న వారంతా కమర్షియల్ సినిమాలు చేస్తున్నవారే. అందుకే ఆయన కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని అందులోనే సక్సెస్‌లు అందుకుంటూ కొనసాగుతున్నాడు. కాగా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న మేజర్ ఆయనకి పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెస్తుందా లేదా చూడాలి.

 


Share

Related posts

Kangana Ranaut: కంగనా రనౌత్ కి కరోనా పాజిటివ్..!!

bharani jella

panchayat raj : ఆ కొత్త జీవో పరిణామం ..! రెవెన్యూ, పిఆర్ శాఖల మధ్య వార్ ..! మంత్రి పెద్దిరెడ్డి ఎమంటారో..?

somaraju sharma

కాంగ్రెస్‌కు ‘హ్యాండ్‘ ఇచ్చిన ఒదిషా పార్టీ చీఫ్

somaraju sharma