వెంటనే ఎలా వెళ్ళాలి?

 

ఉమ్మడి హై కోర్టు విభనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు గురువారం హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు పూర్తి కాలేదని ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్ నుంచి దింపి కొర్టు కార్యకలాపాలు జగకుండా చేస్తున్నారని గుర్తు చేశారు. ఆంధ్రాలో కొర్టు సముదాలు ఇంకా సిద్దం కాలేదని అలాంటప్పుడు ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.

ఆంధ్రా న్యాయవాదులు హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తిని కలిసి తగిన సమయం ఇవ్వకుండా కోర్టును విభజించడం వల్ల కేసుల విభజన, సిబ్బంది విభజన వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. హైకోర్టు విభజనకు మరికొంత వ్యవది ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.