NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana : తెలంగాణలో అడ్వకేట్ల టైం అస్సలు బాగాలేదు !చావు అంచుకు వెళ్లి వచ్చిన మరో న్యాయవాది !!

Telangana : తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్లకు రక్షణ కరువైందా? అన్న భయాందోళనలు న్యాయవాదులను కమ్మేస్తున్నాయి.ఇక్కడ న్యాయవాద వృత్తి కత్తిమీద సాముగా ఉందని వారు భీతిల్లుతున్నారు.వరుసపెట్టి న్యాయవాదులపై జరుగుతున్న దాడులు వారిని కలవరపరుస్తున్నాయి.

నిన్నగాక మొన్న హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతులను దారుణంగా హత్య చేసిన ఉదంతం ఇంకా మరుగున పడకముందే భూమి వివాదానికి సంబంధించి కోర్టులో కేసు ఓడిపోయిన కక్షిదారులు … కేసు ఓడిపోవటానికి లాయరే కారణమని భావించి అతడిపై హత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే అదృష్టం బాగుండి ఆ న్యాయవాది ప్రాణాలతో బయటపడ్డాడు

Advocates time in Telangana is not good at all! Another lawyer who came to the brink of death !!
Advocates time in Telangana is not good at all! Another lawyer who came to the brink of death !!

అసలేం జరిగిందంటే?

హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 7 లో ఉండే హైకోర్టు న్యాయవాది జస్వంత్ ఒకనభూ వివాదానికి సంబంధించిన కేసు వాదించారు. ఇటీవలే ఈ కేసులో కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము ఓడిపోయామని కక్షిదారులు భావించారు. ఫలితంగా చాలా పెద్ద ఎత్తున నష్టపోయామని వారు కోపంతో రగిలిపోయారు.

దీంతో న్యాయవాదిపై కక్షకట్టిన కక్షిదారులు ఈనెల 17వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి అతనితో గొడవకు దిగారు. ఈక్రమంలో న్యాయవాదిపై దాడికి పాల్పడ్డారు. వారిలో కొందరు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టటంతో పాటు కత్తితో పొడించేందుకు సిద్ధమయ్యారు.అయితే ఈ తతంగాన్నంతా చూస్తున్న స్ధానికులు కొందరు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించటం చూసి వెనక్కు తగ్గారు. కొందరు 100 కు ఫోన్ చేయటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటం, సంబంధిత ఎస్సైకు కాకుండా మరోకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించటం పలు అనుమానాలకు తావిస్తోంది.వామనరావు హత్యకేసులో మాదిరిగానే జస్వంత్ పై దాడి ఉదంతంలో కూడా పలుకుబడి గల రాజకీయ నాయకులు ఉన్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.వామనరావు హత్యకేసులో బడా రాజకీయ నేతల పేర్లు వినిపిస్తూ ఉండటం తెలిసిందే.

 

author avatar
Yandamuri

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju