రాఫెల్ పై అఫిడవిట్ తప్పుల తడక

రాఫెల్ డీల్ కు సంబంధించి కేంద్రం సుప్రీం కోర్టులో సమర్పించిన అఫిడవిట్ ను లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తప్పుల తడకగా అభివర్ణించారు. రాఫెల్ ఒప్పందంపై లోక్ సభలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్రం ప్రజలనే కాకుండా కోర్టును కూడా తప్పుదోవపట్టించిందని విమర్శించారు. అందుకే తాము జాయంట్ పార్లమెంటరీ కమిటీ కోసం పట్లుబడుతున్నామన్నారు. రాఫెల్ పై కాగ్ నివేదికను పబ్లిక్ అక్కౌంట్ కమిటీకి పంపామని కేంద్రం సుప్రీం కు ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొనగా, ఆ కమిటీ చైర్మన్ అయిన మల్లికార్జున్ ఖర్గే అది శుద్ధ అబద్ధమని పేర్కొన్న సంగతి తెలిసిందే. పీఏసీ చైర్మన్ అయిన తనకు తెలియకుండా కాగ్ నివేదిక పీఏసీకి ఎలా సమర్పిస్తుందని ప్రశ్నించారు.