38ఓవర్లలో ఆస్టేలియా 189 పరుగులు

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డే మ్యాచ్‌లో పరాజయం పాలైన భారత క్రికెట్ జట్టు ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండవ వన్డేలో పట్టు బిగుస్తొంది. ఇప్పటి వరకూ అందిన వార్తల ప్రకారం 38 ఓవర్లకు ఆస్ట్రేలియా 189 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, జడేజా, షమీ చెరో వికెట్‌లు పడగొట్టగా, భారత ఆటగాళ్లు చురుకైన సమన్వయతంతో ఆడుతున్నారు. ఖవాజౌ, హ్యాండ్స్ కోంబ్ రనౌట్‌గా వెనుతిరిగారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున షాన్ మార్ష్ (86), గ్లెస్ మాక్స్ వెల్ (0) క్రీజులో ఉన్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టుకు సిరీస్‌పై ఆశలు ఉంటాయి.