Bigg Boss 5 Telugu: హౌస్ నుండి బయటక వచ్చాక నటరాజ్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..వాడు పిల్ల బచ్చ..!!

Share

Bigg Boss 5 Telugu: నాలుగో వారం ఇంటి నుండి నటరాజు మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా స్టార్ హీరోలతో.. స్టెప్పులు వేయించి నటరాజ్ మాస్టర్ డాన్స్ బేబీ డాన్స్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఇంతటి క్రేజ్ కలిగిన మాస్టర్.. హౌస్ లో దిగ్విజయంగా నాలుగు వారాలు ఉండటం జరిగింది. అయితే హౌస్లో ముక్కుసూటిగా మాట్లాడటం తో పాటు… తానే హౌస్ లో హీరో అన్న తరహాలో అతిగా డైలాగులు ప్రత్యర్థులపై వేయటంతో…. నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో…. చేరటంతో తక్కువ ఓట్లకు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. హౌస్ లో ఉన్న చాలా మంది సభ్యులకు జంతువుల పేర్లు పెట్టి హైలెట్ అయిన నటరాజ్ మాస్టర్ ముఖ్యంగా యాంకర్ రవి కి గుంటనక్క అనే టైటిల్ పెట్టడం… సీజన్ ఫైవ్ మొత్తానికి హైలెట్. ఇదిలా ఉంటే హౌస్ నుండి… ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు చాలావరకు బయట ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఈ తరహాలోనే నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ షో.. నిర్వాహకుల ఇంటర్వ్యూల్లో పాల్గొనడం జరిగింది. అరియనా యాంకరింగ్ చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో నటరాజ్ మాస్టర్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో విశ్వ ఫోటో తో పాటు మరో కంటెస్టెంట్ ఫోటో పగలగొట్టడం జరిగింది. లోబో గురించి మాట్లాడుతూ అతడు హౌస్ లో క్లోజ్ గా ఉండే వాడు కానీ అదే రీతిలో చాలా టర్నింగ్ అన్న తరహాలో గాలి తీసేశాడు. ఇక జెస్సీ గురించి మాస్టర్ ఇంటర్వ్యూలో తనదైనశైలిలో రెచ్చిపోయాడు. వాడొక పిల్ల బచ్చ…, మొన్న పులిహార కలపాలని ప్రయత్నాలు చేయగా అది పులిసిపోయింది అంటూ సెటైర్లు వేశారు.

నామినేషన్ టైంలో గుంటనక్క

మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ టైంలో జెస్సీకి నటరాజ్ మాస్టర్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు నువ్వానేనా అన్నట్టుగా డైలాగులు వేసుకున్నారు. ఈ క్రమంలో హౌస్ నుండి బయటకు వచ్చాక నటరాజ్ మాస్టర్ జెస్సీ మీద మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ యాంకర్ రవి టాస్క్ వచ్చినప్పుడు నత్త లాగా.. నామినేషన్ టైంలో గుంటనక్క లాగా.. వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. శ్వేతా ఎవరితో కలవద్దని తనకంటూ ప్రపంచాన్ని ఆమె సృష్టించుకున్నది అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రియా ఫిట్టింగ్ మాస్టర్ అని అన్నారు. శ్రీ రామచంద్ర ముద్దపప్పు అని అతడు మాస్క్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నారని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో మీరు మైక్ ధరించండి చెవుల్లో మాట్లాడకూడదు అంటూ.. ఎక్కువ ప్రకటనలు కాజల్ వల్ల వచ్చాయని తెలిపారు. షణ్ముఖ్ జస్వంత్…కి మంచి తెలివి ఉన్నప్పటికీ ఉపయోగించట్లేదు అని గేమ్ ఆడాలని కోరాడు. లోబో… రవి ఇచ్చిన మాస్క్ గేమ్ ఆడుతున్నాడు అని నటరాజ్ మాస్టర్ ఈ ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది.Bigg Boss Telugu 5, Day 4, September 9, highlights: From Siri becoming the first captain to an argument between Lahari and Uma, here's a glance at the events - Times of India

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా వీళ్లను ఎంట్రీ

ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే నటరాజ్ మాస్టర్ నీ… మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పిస్తే చాలా బాగుంటుందని బయట జనాలు చెప్పుకుంటున్నారు. హౌస్ లో ఉన్నంతకాలం అతిగా డైలాగులు వేసిన గాని… నటరాజ్ మాస్టర్ టాస్క్ లో… హండ్రెడ్ పర్సెంట్ కృషి చేసే వారిని… ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో పెద్దగా టాస్క్ ఎంటర్టైన్మెంట్ పరంగా.. ఎంటర్టైన్ చేసే వాళ్ళు గాని లేరని కేవలం గ్రూపులు క్రియేట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని హౌస్ లో ఉన్న వాతావరణంపై బయట జనాల టాక్. ఒక్క నటరాజ్ మాత్రమే కాదు ఉమాదేవి ఇంకా లహరి.. మొదటి వారం ఎలిమినేట్ అయిన సరియు..నీ మళ్లీ ఇంటిలోకి పంపిస్తే చాలా బాగుంటుందని.. చెప్పుకొస్తున్నారు. మరి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా వీళ్లకి  ఎంట్రీ ఇస్తారా లేకపోతే.. కొత్త వాళ్ళని పంపుతారో చూడాలి.


Share

Related posts

కస్టమర్లకు మారుతీ సుజుకీ బంపర్ ఆఫర్..!

Muraliak

బిగ్ బాస్ 4 : మారనున్న బిగ్ బాస్ టైమింగ్స్..! ఎప్పుడంటే….

arun kanna

Bigg Boss 5 Telugu: నాగార్జున ముందే మాట మార్చేసిన కంటెస్టెంట్ శ్రీ రామ్..!!

sekhar