f 3 : ఎఫ్ 3.. సక్సెస్ ఫుల్ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్ గా రూపొందుతోంది. ఎఫ్ 2 వంద కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. వారికి జంటగా సీనియర్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా, యంగ్ బ్యూటీ మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ స్టార్ మేకర్ దిల్ రాజు నిర్మిస్తుండగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. 80 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమా తాజాగా సెట్స్ మీదకి వచ్చింది. త్వరలో బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి అనుకున్న సమయానికి ఎఫ్ 3 రిలీజ్ చేయనున్నారు.

ఇక మరొకవైపు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ, సిద్దు ముద్ద కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇటీవలే ఈ సినిమా కోసం జిం లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇది చూస్తే వరుణ్ గని సినిమా కోసం ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమవుతోంది. అయితే అందరూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు.
f 3 : గని సినిమాను తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలల్లో రిలీజ్ చేస్తారట.
కానీ ఇంకా వరుణ్ తేజ్ ఆ తరహా సినిమాలు కమిటవడం లేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం గని తర్వాత వరుణ్ చేయబోయే సినిమాలు పాన్ ఇండియన్ సినిమాలని తెలుస్తోంది. గని కూడా పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం రాలేదు. గని సినిమాను తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలల్లో రిలీజ్ చేస్తారట. ఎఫ్ 3, గని సినిమాలు గనక బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఇక వరుణ్ రేంజ్ టాలీవుడ్ లో బాగా పెరగడం ఖాయం. వరుణ్ లాంటి కటౌట్ కి మాస్ పాన్ ఇండియన్ కథ ..దాన్ని తెరకెక్కించే దర్శకుడు భారీ హిట్ గ్యారెంటీ.