Abbas: హీరో అబ్బాస్ అందరికీ సుపరిచితుడే. ముఖ్యంగా 90′ లలో దక్షిణాది సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరో. తెలుగు ప్రేక్షకులకు అందరికీ “ప్రేమదేశం” సినిమాతో బాగా దగ్గర కావడం జరిగింది. అబ్బాస్ హెయిర్ స్టైల్ అప్పట్లో ట్రెండింగ్. చాలా మంది యువత హీరో అబ్బాస్ నీ అనుసరించే వాళ్ళు. లవర్ బాయ్ ఇమేజ్ కలిగిన అబ్బాస్… తెలుగులో చాలా సినిమాలు చేయడం జరిగింది. సహాయ నటుడిగా ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. అప్పట్లో కెరియర్ పరంగా బిజీగా ఉన్న అబ్బాస్ కొన్నాళ్లకు సినిమాలకు దూరం కావడం తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేవలం ప్రకటనలలో మాత్రమే కనిపించేవాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు అక్కడే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు హీరో అబ్బాస్ చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతోంది. విషయంలోకి వెళితే శ్రీవాసు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అబ్బాస్ స్పెషల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ కి అనేక హిట్లు పడ్డాయి.
మళ్లీ చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తూ ఉండటం సంచలనంగా మారింది. డింపుల్ హయతి ఈ సినిమాలో హీరోయిన్. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో మైసూర్ ప్రాంతాలలో జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో గోపీచంద్ స్వల్పంగా గాయపడటం జరిగింది. ఏది ఏమైనా మళ్ళీ చాలా కాలం తర్వాత హీరో అబ్బాస్ తెలుగు సినిమాల్లో నటించడానికి ముందుకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.