Major: అడవి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన “మేజర్” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 3వ తారీకు పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముంబై 26/11 దాడుల నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు బాగా కనెక్ట్ కావడం మాత్రమే కాదు బాగా ఎమోషన్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి నిర్మాతగా కావడంతో మరింతగా “మేజర్” మూవీ కి క్రేజ్ రావడం జరిగింది. సినిమా రిలీజ్ అయిన రోజే డైరెక్టర్ హరీష్ శంకర్, డిజే టిల్లు హీరో… చివరి అరగంటలో ఏడుపు వచేసిందని.. మర్చిపోలేని సినిమా అని కితాబిచ్చారు.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సైతం “మేజర్” మూవీ పై ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే మహేష్ బాబు చూసి కంటతడి పెట్టుకున్నట్లు అడవి శేష్ ఇటీవల సక్సెస్ మీట్ లో తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్ సదా కూడా “మేజర్” చూసి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. సినిమా ఫస్టాఫ్ లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని ఆమె తెలియజేసింది.
మేటర్ లోకి వెళ్తే అప్పట్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో తాను కూడా ముంబైలోనే ఉండటం జరిగిందని పేర్కొంది. దీంతో “మేజర్” సినిమా చూస్తుంటే ఆ నాటి రోజులు గుర్తుకు వచ్చాయని… సన్నివేశాలు చూస్తే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. డైరెక్టర్ శశికిరణ్ సినిమాని నడిపించిన విధానం అడవి శేష్ నటన సినిమాకి హైలెట్ గా నిలిచాయి అని తనదైన శైలిలో హీరోయిన్ సదా “మేజర్” మూవీపై పొగడ్తల వర్షం కురిపించింది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…