ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో సినిమా తీస్తునాడు పూరి జగన్నాధ్. ఈ సినిమా సగ భాగం షూటింగ్ అవగా మళ్ళీ నవంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళాలని పూరి టీం భావిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా పాన్ ఇండియన్ సినిమాగా పూరి, ఛార్మి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మేకర్ కరణ్ జోహర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితేలాక్ డౌన్ లో దాదాపు 7-8 కథ ఉ రెడీ చేసుకున్న పూరి ఎవరితో సినిమా చేయనున్నాడు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా ఇప్పటికే రెడీ చేసుకున్న జనగణమన మహేష్ బాబు తో తీస్తాడని చర్చలు జరుగుతున్నాయి. పూరి కూడా ఈ ప్రాజెక్ట్ ని త్వరలో మొదలు పెడతానని ఆమధ్యన చెప్పుకొచ్చాడు. అలాగే నందమూరి బాలకృష్ణ తో చేస్తాడన్న టాక్ కూడా ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్ వచ్చింది కాని. పైసా వసూల్ చేయలేకపోయింది. అయితే ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడటంతో మళ్ళీ వీలైంత త్వరలో సినిమా చేయాలనుకున్నారు. దాంతో విజయ్ దేవరకొండ తరువాత పూరి చేయబోయే సినిమా బాలయ్య తోనే అనుకున్నారు. కాని ఒక్కడే పెద్ద ట్విస్ట్ ఉందని తెలుస్తోంది.
అక్కినేని నాగార్జున – డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పూరి డైరెక్షన్ లో నాగార్జున శివమణి, సూపర్ సినిమాలు చేశాడు. రెండూ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అప్పటనుంచి హ్యాట్రిక్ సినిమా చేయాలనుకున్నప్పటికి కుదరలేదు. అయితే ఎట్టకేలకి ఈ కాంబినేషన్ లో సినిమా మొదలవబోతుందని తాజా సమాచారం. మొదటిసారి ఒక విభిన్నమైన కథతో పూరి నాగార్జున సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుందట.