తెలుగుదేశం పార్టీ రథసారథి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తుగడల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తన పంథాలో ముందుకు సాగుతున్నారు.
ఈ ఇద్దరు నేతలు గతంలో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొద్దికాలం క్రితం వీరి దారులు వేరయ్యాయి. అయితే మళ్లీ ఓ అంశంలో వీరిది ఒకటే మాట అయిందంటున్నారు.
జాతీయ స్థాయిలో చర్చ
నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీదకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుకుంటున్నారా? కాదండి బాబు ఆ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో. ఔను. సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక ట్వీట్ ద్వారా రజనీ ఈ విషయాన్ని ప్రకటించగా తలైవా ఎంట్రీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం మీద ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ సైతం రియాక్టయ్యారు.
ఓహ్… ఇక్కడే బాబు పవన్ ఒక్కమాట
రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి చంద్రబాబు స్పందిస్తూ , రజనీ కాంత్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని చంద్రబాబు అన్నారు. రజనీకాంత్ ప్రకటనను స్వాగతిస్తున్నానని పేర్కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యంలో పార్టీలు రావడం సహజమేనని విశ్లేషించారు.
పవన్ ఏమంటున్నారంటే…
పవన్ కళ్యాణ్ సైతం ఇదే రీతిలో తన అభిప్రాయాలు వెల్లడించారు. రజనీ ఎంట్రీని స్వాగతించిన పవన్ ఆయన ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రాజకీయల్లోనే ఉన్నారు అని పేర్కొన్నారు. రజనీకాంత్‌కు మంచి జరుగుతుందని భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ , ఆ పార్టీతో పొత్తు కోసం ఓ రేంజ్లో ఆరాటపడుతున్న చంద్రబాబు సూపర్ స్టార్ ఎంట్రీ గురించి మొత్తంగా ఇలా విశ్లేషించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?