Agneepath Protests: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకర ఘటనకు సూత్రదారిగా భావిస్తున్న సాయి ఢిఫెన్స్ అకాడమి డైరెక్టర్ ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆందోళనలో పాలు పంచుకున్న 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో రైల్వే స్టేషన్ పై దాడి వెనుక ఆవుల సుబ్బారావు సహకారం ఉందని తెలుసుకున్నారు. నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ఏపి, తెలంగాణలో ఆరు కోచింగ్ సెంటర్ లు ఉన్నాయనీ, ఆందోళనలో నరసరావుపేటకు చెందిన 400 మందికిపైగా అభ్యర్ధులు పాల్గొన్నట్లు తెలుస్తొంది. విద్యార్ధులను రెచ్చగొట్టి సుబ్బారావు ఆందోళనకు పంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం పది ప్రైవేటు డిఫెన్స్ అకాడమిలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆవుల సుబ్బారావును ఖమ్మంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేటకు తరలించారు. అక్కడ నుండి హైదరాబాద్ కు తరలించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
మరో పక్క ఏపిలోని గుంటూరులో రైల్వే స్టేషన్ లో ఆందోళన చేసేందుకు బయలుదేరిన ఆర్మీ అభ్యర్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ల వద్దకు వెళ్లే వారిని తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలియడానికి వచ్చిన ఆర్మీ అభ్యర్ధులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…