Agneepath Protests: అగ్నిపథ్ నియామక విధానంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ త్రివిధ దళాల ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసంలో పాల్గొన్న వారికి ఆర్మీలో చేర్చుకునేది లేదని లెప్టనెంట్ జనరల్ అనిల్ పూరీ పేర్కొన్నారు. ఆర్మీలో క్రమశిక్షణారాహిత్యానికి తావులేదని స్పష్టం చేసిన ఆయన .. అగ్నిపథ్ నియామకాల్లో ప్రతి అభ్యర్ధి నిరసనల్లో పాల్గొనలేదని దృవపత్రం సమర్పించాలని అది లేకుంటే ఎవరినీ చేర్చుకునేది లేదని చెప్పారు. ఎవరిపై అయినా ఎఫ్ఐఆర్ దాఖలు అయితే వారికి ఆర్మీలో చేరే అవకాశం ఉండదని అన్నారు. విధ్వంసానికి పాల్పడలేదని వారు ఎన్ రోల్ మెంట్ లో రాతపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుందని, ఆ తర్వాత పోలీసుల ద్వారా వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేశారు.
వాయుసేనలో తొలి అగ్నివీరుల బ్యాచ్ రిజిస్ట్రేషన్ జూన్ 24 నుండి ప్రారంభం అవుతుందని, జూలై 24 నుండి ఫేజ్ 1 ఆన్ లైన్ పరీక్షలు మొదలు అవుతాయని ఎయిర్ మార్షల్ ఎస్ కే ఝ చెప్పారు. డిసెంబర్ నాటికి తొలి బ్యాచ్ ను చేర్చుకుంటామని, డిసెంబర్ 30 నాటికి శిక్షణ మొదలు పెడతామని తెలిపారు. నావికాదళానికి సంబంధించిన అగ్నివీరులు నవంబర్ 21 నాటికి తమతమ శిక్షణా శిబిరాలకు చేరుకుంటారని నేవీ వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి పేర్కొన్నారు. పురుషులతో పాటు మహిళా అభ్యర్ధులను సైతం నియమించుకోనున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ తొలి వారం నాటికి తొలి బ్యాచ్ లో 25వేల మంది అగ్నివీరులను చేర్చుకుంటామని, 2023 ఫిబ్రవరి నాటికి రెండో బ్యాచ్ ను నియమించుకుంటామని లెప్టినెంట్ జనరల్ బన్నీ పొన్నప్ప తెలిపారు. 2023 ఫిబ్రవరి నాటికి నియామకాల సంఖ్య 40వేలకు చేరుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రిక్రూట్ మెంట్ ర్యాలీలు ఉంటాయని తెలిపారు. 40వేల మందిని నియమించుకునేందుకు 83 ర్యాలీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అనౌన్స్ చేసిన వెంటనే ఆర్మీ అభ్యర్ధుల్లో ఆందోళన మొదలైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అభ్యర్ధుల నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో పట్టుదలగా ఉంది.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…