Agnipath Scheme Protest: కేంద్రం తీసుకువచ్చిన “అగ్నిపథ్” విధానాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీహార్, యూపీ, తెలంగాణల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించిన ఆందోళన కారులు..రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. బీహార్ లోని లఖీసరాయ్ రైల్వే స్టేషన్, తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు రైలుకు నిప్పు పెట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ స్టూడెంట్స్ భీభత్సం సృష్టించారు. స్టాల్స్ ను పగులగొట్టారు. రెండు సంవత్సరాల నుండి తమకు ఆర్మీ పరీక్షలు నిర్వహించడం లేదనీ, కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళనకారులు అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్మీ అభ్యర్ధులు 2,500 మంది వరకూ ఉన్నారు. వీరంతా ఒక్క సారిగా రైల్వే స్టేషన్ పై పడటంతో పోలీసులు కూడా ఏమి చేయలేక చేతులెత్తేశారు. 1,2,3,4,5 ఫ్లాట్ ఫారాలపై భీభత్సం సృష్టించారు.
ఆందోళనకారులు రైళ్లపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలాయి. కొన్ని బోగీలకు నిప్పు అంటించారు. ఈ ఆందోళనలతో ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. పరిస్థితులను అదుపుచేసేందుకు అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. పోలీసు బలగాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు మృతి చెందాడు. ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ లో ఆందోళనల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైళ్ల రాకపోకలను బంద్ చేశారు అధికారులు. మరో పక్క సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే బస్సులను బంద్ చేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మీ అభ్యర్ధుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భారీ బందోబస్తుకు ఆదేశాలు జారీ చేసింది.
“అగ్నిపథ్” పథకం ద్వారా 17.5 నుండి 21 సంవత్సరాల వయస్సు మద్య ఉన్న యువకులు త్రివిధ దళాలలో చేరవచ్చు. ఈ ఏడాది మాత్రం గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచారు. నాలుగేళ్ల పాటు సేవలు అందించిన తరువాత వీరిలో 25 శాతం మందికి మాత్రమే సైన్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద సైన్యంలో చేరిన వారిని అగ్నివీరులుగా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46వేల మంది సైనికులను నియమించనున్నట్లు రక్షణ శాఖ గత మంగళవారం ప్రకటించింది. దీంతో సైనిక ఉద్యోగాలకు ఎంపికై ఫిజికల్, మెడికల్ పరీక్షలు పూర్తి అయిన అభ్యర్ధుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. “అగ్నిపథ్” పేరిట నిరుద్యోగులకు అగ్నిపరీక్ష పెట్టవద్దని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…