అగ్రిగోల్డ్ బాధితుల నిరవధిక దీక్ష భగ్నం

 

విజయవాడ, డిసెంబర్ 29:  రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నాయకులు చేస్తున్న ఆమరణ దీక్షను శనివారం వేకువ జామున పోలీసులు భగ్నం చేశారు.  అగ్రిగోల్డ్ బాధితులు గత వారం రోజులుగా గాంధీ చౌక్ వద్ద రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ నేపధ్యంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ , ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షుడు  విశ్వనాధరెడ్డి,  ప్రధాన కార్యదర్శి తిరుమలరావులు నిరవధిక దీక్ష చేపట్టారు.  శనివారం వేకువ జామున పోలీసులు నిరాహార దీక్ష చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంలో కొద్ది సేపు ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది, పోలీసు అధికారులు బలగాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.