NewsOrbit
జాతీయం న్యూస్

Aiims Chief: కరోనా మహమ్మారిపై ఎయిమ్స్ చీఫ్ గులేరియా కీలక సూచనలు ఇవీ..!

Aiims Chief: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా పూర్తిగా కట్టడి కాలేదు. మరో వైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందంటూ వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు.


వచ్చే ఆరు నుండి ఎనిమిది వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన గులేరియా..ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం మహమ్మారి నుండి బయటపడి మునుపటి పరిస్థితికి వెళ్లవచ్చని అన్నారు. దేశంలో మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని ఆయన తెలిపారు. ప్రధానంగా పండుగల సీజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తనకు కరోనా రాదనే భ్రమలో ఉండరాదనీ, వారు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒక వేళ కరోనా సోకినా అది లేలికపాటి ధశకే పరిమితం అవుతుందని అన్నారు. వ్యాక్సిన్ అనేది రోగం తీవ్రతరం కాకుండా చూస్తుందని తెలిపారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి తిరోగమనంలో సాగుతోందనీ, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన హెచ్చరించారు. కేసుల సంఖ్య మళ్లీ పెరిగే పరిస్థితి తీసుకురాకూడదని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ ఉండాలనీ, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దని గులేరియా సూచించారు.
కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాస్కులు అయితే ధరిస్తున్నారు కానీ ఎక్కడా భౌతిక దూరం పాటిస్తున్న దాఖలాలు కనబడటం లేదు. వివిధ మార్కెట్లు జనసమర్ధంతోనే కొనసాగుతున్నాయి. అధికారుల సూచనలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

విద్యాసంస్థలను కూడా తెరవడంతో పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా అక్కడక్కడా కరోనా బారిన పడుతున్నారు. అయితే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించకుండా ఉండేందుకు ఎయిమ్స్ చీఫ్ సూచనల మేరకు మరో ఆరు నుండి ఎనిమిది వారాల పాటు జాగ్రత్తలు పాటించాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju