సుశాంత్ కేసులో ఎయిమ్స్ ఏం చెప్పిందంటే..!?

 

 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈయన మరణం అనంతరం అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయం అందరికి విదితమే. తాజాగా  ఆయన మరణం పై ఎయిమ్స్ నివేదిక ఇచ్చింది.

సుశాంత్ పై ఎటువంటి విష ప్రయోగం జరుగలేదని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఉరి వేసుకోవడం వలనే అతను మరణించాడని  ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. సుశాంత్ రాజ్ పుత్ డిఎన్ఎ ను పరిశీలించామని, అనంతరం  ఈ నివేదికను సీబీఐ కి అందజేశామని తెలిపారు. కాగా సుశాంత్ కుటుంబ న్యాయవాది వికాస్ సింగ్ మాత్రం  సుశాంత్ గొంతు నులమడం వలనే మరణించాడని ఆరోపిస్తున్నారు.  ఎయిమ్స్ నుంచి అందుకున్న రిపోర్ట్ ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. సుశాంత్ సింగ్ ను ఎవరైనా హత్య చేశారా… లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఇప్పుడు నిర్ధారించలేమని వెల్లడించారు.