భారత ప్రభుత్వ విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ లో వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఎటువంటి రాతపరీక్ష లేకుండా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూల ఆధారంగా నియామక ప్రక్రియ చేయనున్నారు.. పూర్తి వివరాలు ఇలా..
మొత్తం ఖాళీలు: 24
విభాగాలు :
హెడ్ రెవిన్యూ మేనేజ్మెంట్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, హెడ్ ఇంజనీర్ తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హతలు :
ఈ పోస్ట్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్ ఏరోనాటికల్), ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం:
అప్లై చేసుకున్న దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
వయసు :35-59 ఎల్ల మధ్య ఉండాలి. ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు : రూ.1500/-
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ :15/1/2021
వెబ్ సైట్ : https://www.airindia.in/
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?