Pollution: వాయు కాలుష్యం వలన మానవులు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.. దేశంలో చాలా ప్రాంతాల్లో వాయు నాణ్యత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. కాలుష్యం నేడు మనిషిని రోగిగా మారుస్తుంది..! కాలుష్యం వల్ల గుండె జబ్బులు వస్తాయా.!? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..!?

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కోర్ 200 నుంచి 300 మధ్య ఉంటే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని అర్థం. ఒకవేళ ఈ స్కోర్ 300 కంటే పైన ఉంటే అది ప్రమాదకరమైన తీవ్ర కాలుష్యం అని నిపుణులు చెప్తున్నారు. గాలిలోని పార్టికల్ రేడియో యాక్టివిటీ వల్ల గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన రోగాల స్థాయి పెరిగి చనిపోతారని చెప్తున్నారు. 2001 నుంచి 2015 మధ్యలో జరిగిన 75 వేలకు పైగా మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవి కావని గుర్తించారు.
ఎక్కువ సమయం ఇల్లు లేదా ఆఫీస్ కార్యాలయంలో గడపడం శ్రేయస్కారమని వేరే వేరే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు.. ఎన్ 95 లేదా పీఎం 2.5 మాస్క్ ధరించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఢిల్లీలోని వాయునాన్యత 211 ఉన్నట్లు గా నిపుణులు చెబుతున్నారు.. సాధ్యమైనంత వరకు కాలుష్యం లోకి వెళ్లకుండా ఉండేలా చూసుకోవాలి.. ఒక వేళ వెళ్లిన తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..