Dhanush-aishwarya: వెండితెరపైన చాలా గొప్ప ప్రేమకథలు, బలమైన భార్యాభర్తల అనుబంధాలకు సంబంధించిన కధలలో నటించి, మెప్పించి, విపరీతమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నటువంటి మన సినిమా హీరోలు, హీరోయిన్లు నిజజీవితంలో మాత్రం జీరోలై కూర్చుంటారు. అవును.. సమాజానికి నీతి కధలను చూపించిన వాళ్లే నీతి తప్పుతూ వుంటారు. ఇటీవల కాలంలో చూసుకుంటే.. సమంత – నాగ చైతన్య, అమీర్ ఖాన్ – కిరణ్ రావ్, ధనుష్ – ఐశ్వర్యలు.. ఇంకా అనేకమంది విడాకులు తీసుకున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో రజని కుమార్తె ఐశ్వర్య మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
Anasuya: వయసుపై తప్పుడు ప్రచారం.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన అనసూయ!
Dhanush-aishwarya: ఐశ్వర్య రాజేష్ అంతరంగం:
తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తాజాగా వారు విడాకులతో ముగింపు పలికారు. ఈ క్రమంలో రజనీకాంత్ ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. పిల్లల భవిష్యత్, చదువుల కోసమైనా కొన్నాళ్లు కలిసి ఉండాలని ఆయన వారిని కోరినా.. లాభం లేకుండా పోయింది. ఇకపోతే భర్తతో విడిపోయిన తర్వాత ఐశ్వర్య తొలిసారి ఓ తమిళ మీడియా వేదికగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రేమ అనేది చాలా అద్భుతమైనదిగా అభివర్ణించింది. అయితే అంత అద్భుతమైన ప్రేమ కేవలం ఒక వ్యక్తికో లేదా ఒక వస్తువుకో పరిమితం కాదని చెప్పింది.
kalaavathi Song: ఏంటీ.. `కళావతి` సాంగ్కు అంత ఖర్చు పెట్టారా..?
ఆమె మాటల్లో ప్రేమ అంటే ఇదే:
ఐశ్వర్య మాట్లాడుతూ.. ప్రేమ అంటే ఒకరి భావాలను మరొకరు అర్థం చేస్తుకోవడం, వ్యక్తపరుచుకోవడమే ప్రేమ అని చెప్పుకొచ్చారు. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ.. తన మనసులో ప్రేమకు నిర్వచనం మారుతూ వచ్చిందని అన్నారు. అలాగే ప్రేమ ఒక వ్యక్తితో మారిపోదని కూడా భావించారు. అయితే ప్రస్తుతం తనకు తన తల్లిదండ్రులు, పిల్లలమీద మాత్రమే అత్యంత ప్రేమ ఉందని స్పష్టం చేసారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?