Allari naresh : టాలీవుడ్ లో ఈ ఏడాది కరోనా క్రైసిస్ నడుమ విడుదలైన సినిమాలలో నాంది ఒకటి. బ్లాక్ బస్టర్ అయిన సినిమాలలో నాంది కూడా ఉంది. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ ఇండస్ట్రీ హిట్ అయితే ఆ తర్వాత మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది అల్లరి నరేష్ నటించిన నాంది. గత కొంత కాలంగా హిట్ లేని నరేష్ కి ఈ సినిమా మంచి హిట్ ఇచ్చింది. మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇప్పటి వరకు నరేష్ చేసినవన్నీ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలే. మొదటిసారి నంది సినిమాలో సీరియస్ రోల్ పోషించాడు. న్యూడ్ సీన్ లో కూడా కనిపించాడు.
యంగ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ తో సినిమా మీద బాగా అంచనాలను పెంచారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నాంది తెరకెక్కించాడు దర్శకుడు విజయ్ కనకమేడల. క్రాక్ సినిమాలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇందులో లాయర్ గా నటించారు. ఆమె పాత్ర సినిమాకి చాలా హైలెట్ గా నిలిచింది. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
Allari naresh : అల్లరి నరేష్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తాడా లేక మరొక హీరో నటిస్తాడా..?
ప్రస్తుతం న్యాయవ్యవస్థలోని లోపాలను బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఇదే సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం అయింది. దర్శకుడు సతీష్ వేగేష్న ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. దిల్ రాజు – అజయ్ దేవగన్ కలిసి నిర్మిస్తున్నారు. సక్సెస్ మీట్ సమయంలో దిల్ రాజు నాంది సినిమాకి సంబంధించిన హిందీ, తమిళం, కన్నడ భాషల రీమేక్ రైట్స్ కొన్నారు. ముందుగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే ఇందులో అల్లరి నరేష్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తాడా లేక మరొక హీరో నటిస్తాడా అనేది త్వరలో క్లారిటీ రానుంది.