ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా

ఢిల్లీ, జనవరి 4: ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమాను ట్విటర్ ద్వారా ఆయన శుక్రవారం  ప్రకటించారు.

పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో గురువారం రాత్రి మాకెన్ సమావేశమై చర్చించిన తదనంతరం రాజీనామా వెలువడింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన మాకెన్ నాలుగేళ్ల పాటు పార్టీ అధ్యక్షుడు  దగ్గరనుంచి పార్టీ కార్యకర్తలు మీడియా నుండి వెలకట్టలేని ప్రేమ, మద్దతు పొందినట్లు ట్వటర్‌లో పేర్కొన్నారు.

మాకెన్ రాజీనామాను అంగీకరిచిన రాహుల్ గాంధీ ఆయన స్ధానంలో పార్టీ సీనియర్ నేత అర్విందర్ సింగ్ లవ్లీకి ఢిల్లీ బాధ్యతలను అప్పగించారు.

అనారోగ్య కారణాలతో మాకెన్ తప్పుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నప్పటికీ, లోక్‌సభకు పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లు  వార్తలు వినిపిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ‌లో  కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ పాటు అధికారంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పటినుంచి మాకెన్‌కు బాధ్యతలు అప్పగించారు. 2017లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ మాకెన్ రాజీనామా చేశారు. అప్పట్లలో రాహుల్ కోరడంతో మళ్ళీ పార్టీ  బాధ్యతలను చేపట్టారు.

SHARE