NewsOrbit
న్యూస్

ఎలక్షన్ గెలిచిన తరవాత జగన్ భయపడ్డం ఇదే మొట్టమొదటిసారి .. ఇది సెన్సేషనే !

తాజాగా విద్యుత్ పేరుచెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు చాలా అలజడినే సృష్టించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైకాపా కు సంబందించిన నాయకులు కాకుండా సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పందించారు. కేంద్రం రాష్ట్రానికి ఒక యూనిట్‌ విద్యుత్‌ను రూ.2.70కే సరఫరా చేస్తుంటే, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌ రూ.9 చొప్పున సరఫరా చేస్తోందన్న నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని.. పరిశ్రమలకు యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేయాలని 2017లో టీడీపీ సర్కార్‌ చేసిన నిర్ణయంలో తామెలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు.

Ajay Kallam
Ajay Kallam

దేశంలో పరిశ్రమలకు యూనిట్‌ విద్యుత్‌ ను తెలంగాణ రూ.7.60, మహారాష్ట్ర రూ.7.25, రాజస్తాన్‌ రూ.7.30, కర్ణాటక రూ.7.20, తమిళనాడు రూ.6.35 చొప్పున సరఫరా చేస్తుంటే… ఏపీ రూ.6.65 చొప్పున సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఆ సంగతులు అలా ఉంటే… రాష్ట్రంలో కుటుంబ పాలన, కులం, అవినీతిని రూపుమాపాలనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామన్న కల్లం… వాటిపై పోరాటం చేసే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ విషయంపై లోకేష్ కు బాబుకు కలిపి సెటైర్ వేసిన ఆయన… ఎన్నడూ ప్రజా జీవితంలో లేకున్నా, ఎలాంటి అర్హతలు లేకున్నా, ఎమ్మెల్యే కాకున్నా.. కేవలం కొడుకు అనే ఏకైక కారణంతో మంత్రిని చేసిన కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలనే ఆమె అభిప్రాయాలను గౌరవిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయాలతో అంతా బాగానే ఉంది కానీ… పార్టీకి సంబందించినవారెవరూ స్పందించకపోవడంతో రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. విమర్శలు చేసింది కేంద్రమంత్రి అయినప్పుడు.. వాటికి సమాధానాలు కూడా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి నుంచి వచ్చి ఉంటే బాగుండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వ సలహాదారుతో చెప్పించడాన్ని… బీజేపీ పట్ల జగన్ ప్రభుత్వం బయపడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!